Pregnancy : గర్భం ఎందుకు పోతుంది….కారణాలు?

తరువాత మళ్లీ గర్భం దాల్చినా ఇలాగే జరగాలని ఏమీ లేదు. అదే క్రమంలో వయస్సు పెరిగిన మహిళల్లో అంటే 35 సంవత్సరాలు దాటిని వారు గర్భం దాల్చితే జన్యుపరమైన కారణాలతో గర్భస్రావాల ముప్పు అధికంగా ఉంటుంది.

Pregnancy : గర్భం ఎందుకు పోతుంది….కారణాలు?

Pregnancy

Pregnancy : మహిళలకు అమ్మతనం అనేది ఒక కల…గర్భం దాల్చిన తరువాత చాలా మంది తెలియని ఆనందంలో మునిగిపోతారు. మరికొంత మంది తెలియని ఒత్తిళ్ళకు లోనవుతారు. గర్భం దాల్చిన వారిలో కొంతమందికి అనుకోని పరిస్ధితుల్లో మిస్ క్యారేజ్ అవుతుంది. ఈ పరిస్ధితి గర్భం దాల్చిన తొలి వారాల్లోనే జరగవచ్చు లేదంటే తరువాతైనా జరగవచ్చు. ఇలా జరగటం అన్నది మానసికంగా తీవ్ర అవేదన కలిగిస్తుంది.

పిండం ఏర్పడటంలో వచ్చే సాధారణ సమస్య గర్భస్రావానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అదే విధంగా జన్యుపరమైన కారణాలు ఉంటాయి. చిన్నవయస్సులో పెళ్లిళ్లు సైతం గర్భస్రావాలకు కారణమౌతున్నాయి. మూడు నుండి ఐదు నెలల లోపు పిండ దశలో గర్భస్రావాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తొలివారాల్లో గర్భం పోవటానికి చాలావరకూ క్రోమోజోముల లోపమే కారణం కావచ్చు. దీన్నే జన్యుపరమైన కారణంగా చెప్తారు.

తరువాత మళ్లీ గర్భం దాల్చినా ఇలాగే జరగాలని ఏమీ లేదు. అదే క్రమంలో వయస్సు పెరిగిన మహిళల్లో అంటే 35 సంవత్సరాలు దాటిని వారు గర్భం దాల్చితే జన్యుపరమైన కారణాలతో గర్భస్రావాల ముప్పు అధికంగా ఉంటుంది. పొగ, మద్యం తాగినా, అధిక బరువు , గర్భాశయంలో నిర్మాణపరమైన లోపాలున్నా, గర్భాశయ ముఖద్వారం బలహీనంగా ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులవల్ల, మధుమేహం అదుపు తప్పినా.. ఇటువంటి సందర్భాల్లో కూడా గర్భం నిలబడకుండా మధ్యలోనే పోయే ప్రమాదం ఉంటుంది.

గర్భస్రావం జరిగే ముందు లక్షణాలు;

పొత్తికడుపులో తెరలుతెరలుగా నొప్పి, యోని నుంచి ఎరుపు స్రావం గర్భం పోయేటప్పుడు కనబడే సాధారణ లక్షణంగా చెప్పవచ్చు. యోని నుంచి ఎర్రటి రక్తపు గడ్డల్లా, కణజాలం, ముక్కల వంటివి బయటకు వెళుతుంటాయి. కొంతమందిలో ఇలాంటివి ఏవి ఉండవు. లోపల బిడ్డ పెరుగుదల నిలిచిపోతుంది. బిడ్డ చనిపోయే అవకాశాలు ఉంటాయి. వేవిళ్లు తగ్గటం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి వారికి వైద్య పరీక్షలు చేస్తే తప్ప గర్భం పోయిన విషయం బయటపడదు.

కొంతమందిలో కొద్దిగా ఎరుపు లేదా నల్లటి రక్తపు గడ్డలు కనబడి కడుపునొప్పి మాత్రం చాలా తీవ్రంగా, ముఖ్యంగా ఒకవైపు నొప్పి ఎక్కువగా ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో తక్షణం వైద్యులను సంప్రదించాలి. తగిన వైద్య సహాయం పొందాలి.