Vitamin D Importance : శరీరానికి విటమిన్ డి ఎందుకు అవసరం? అదిలోపిస్తే సమస్యలు ఎందుకు వస్తాయ్?

విటమిన్‌ డి లోపిస్తే పేగు, జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. కాలేయం, మూత్రపిండ వ్యాధులు, సిస్టిక్‌ ఫైబ్రోసిస్, ఊబకాయం ఉన్నవారు లేదా గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ సర్జరీ చేయించుకున్న వ్యక్తులు ఎక్కువగా డి విటమిన్‌ లోపాన్ని ఎదుర్కొంటారు. ఆహారం సక్రమంగా తీసుకోకపోవడం లేదా శరీరానికి సూర్యరశ్మి తగినంతగా అందకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది.

Vitamin D Importance : శరీరానికి విటమిన్ డి ఎందుకు అవసరం? అదిలోపిస్తే సమస్యలు ఎందుకు వస్తాయ్?

Vitamin-D

Vitamin D Importance : శరీరానికి అవసరమైన విటమిన్లలో అత్యంత ముఖ్యమైనది విటమిన్ డి. విటమిన్‌ డి కొవ్వులో కరిగే విటమిన్‌. విటమిన్ డీ ఒక స్టెరాయిడ్ హార్మోన్, ఇది సూర్య రశ్మి వల్ల శరీరంలో యాక్టివేట్ అవుతుంది. ఆహారం నుండీ, డయటరీ సప్లిమెంట్స్ నుండి లభిస్తుంది. కాల్షియంని గ్రహించాలంటే శరీరానికి విటమిన్ డీ అవసరం. బోన్ హెల్త్‌కి కూడా విటమిన్ డీ చాలా ముఖ్యం. శరీర కణజాలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చర్మానికి సూర్యరశ్మి తగిలినప్పుడు డి విటమిన్‌ ఉత్పత్తి అవుతుంది.

విటమిన్ డి తక్కువైతే చిన్న పిల్లల్లో రికెట్స్‌కి దారి తీస్తే, పెద్దవారిలో ఎముకలు పెళుసుబారుతాయి. విటమిన్ డీ డెఫిషియెన్సీ బ్రెస్ట్ క్యాన్సర్, కొలోన్ కాన్సర్, ప్రోస్టేట్ కాన్సర్, హార్ట్ డిసీజ్, డిప్రెషన్, బరువు పెరగడం, ఇంకా మరి కొన్ని ఆరోగ్య సమస్యలకి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలసట, నొప్పులు, ఒంట్లో బాగుండంట్లుగా అనిపించడం, మజిల్ పెయిన్, బోన్ పెయిన్, మెట్లు ఎక్కలేకపోవడం, కింద కూర్చుని లేచేప్పుడు ఇబ్బందిగా అనిపించడం వంటివన్నీ విటమిన్ డీ లోపం యొక్క లక్షణాలే. ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించే విటమిన్‌ డి అధిక మొత్తంలో శరీరానికి అందడం చాలా ముఖ్యం.

విటమిన్‌ డి లోపిస్తే పేగు, జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. కాలేయం, మూత్రపిండ వ్యాధులు, సిస్టిక్‌ ఫైబ్రోసిస్, ఊబకాయం ఉన్నవారు లేదా గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ సర్జరీ చేయించుకున్న వ్యక్తులు ఎక్కువగా డి విటమిన్‌ లోపాన్ని ఎదుర్కొంటారు. ఆహారం సక్రమంగా తీసుకోకపోవడం లేదా శరీరానికి సూర్యరశ్మి తగినంతగా అందకపోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. చేప‌లు, రొయ్య‌లు, పుట్ట‌గొడుగులు, పాలు, చీజ్ పప్పుదినుసులు, కూరగాయలు వంటి సమతుల ఆహారం ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి పొందవచ్చు. విటమిన్ డి లోపం ఏర్పడిన సందర్భంలో చాలా మంది వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్ రూపంలో తీసుకుంటుంటారు.

విటమిన్ డి ని వైద్యులు సిఫార్సు చేసిన నిర్ణీత మోతాడులో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ డి సప్లిమెంట్లను ఎలాంటి వైద్యుల సూచనలు లేకుండానే తీసుకోవటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. విట‌మిన్ డి ఎక్కువైతే తీవ్ర‌మైన అల‌స‌ట‌గా అనిపిస్తుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి. కండ‌రాలు బ‌ల‌హీనంగా మారటం, ఎముకల్లో నొప్పి, పెళుసుతనం వంటి రుగ్మతలను చవిచూడాల్సి వస్తుంది.