Ranil Wickremesinghe: శ్రీలంక నూతన ప్రధానిగా విక్రమ సింఘె?

శ్రీలంక నూతన ప్రధానిగా విక్రమ సింఘెను నియమించే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఆయన పదవి చేపట్టబోతున్నారని శ్రీలంక మీడియా వెల్లడించింది.

Ranil Wickremesinghe: శ్రీలంక నూతన ప్రధానిగా విక్రమ సింఘె?

Ranil Wickremesinghe

Ranil Wickremesinghe: శ్రీలంక నూతన ప్రధానిగా విక్రమ సింఘెను నియమించే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఆయన పదవి చేపట్టబోతున్నారని శ్రీలంక మీడియా వెల్లడించింది. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స బుధవారం రణిల్ విక్రమసింఘెతో భేటీ అయ్యారు. ఈ రోజ మరోసారి ఆయన్ను కలిసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రణిల్, కొత్త ప్రధానిగా ఎన్నికవుతారని, అందుకే అధ్యక్షుడు ఆయన్ను కలిశారని మీడియా కథనం. ఇప్పటికే రణిల్ శ్రీలంకకు నాలుగుసార్లు ప్రధానిగా చేశారు.

 

తాజాగా ఆయన ఎన్నికపై లంక ప్రతిపక్షాలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నాయి. 225 సీట్లున్న శ్రీలంక పార్లమెంటులో యునైటెడ్ నేషనల్ పార్టీ తరఫున ఎన్నికైన ఒకే అభ్యర్థి రణిల్ విక్రమసింఘె. ఒకే పార్లమెంటు సీటు ఉన్నప్పటికీ ఆయనకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తుండటంతో, ప్రధానిగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు శ్రీలంక ప్రజలు అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆయన మాత్రం దీనికి అంగీకరించడం లేదు.