Delhi High Court: భర్త శవం కోసం పోరాడిన భార్య.. చివరకు సౌదీ నుంచి ఇండియాకు!

భర్త మృతదేహం కోసం ఓ మహిళ చేసిన న్యాయ పోరాటం ఫలించింది.. మృతదేహం పూడ్చిన 100 రోజుల తర్వాత బయటకు తీసి భార్యకు ఇచ్చారు.

Delhi High Court: భర్త శవం కోసం పోరాడిన భార్య.. చివరకు సౌదీ నుంచి ఇండియాకు!

Delhi High Court

Delhi High Court: భర్త మృతదేహం కోసం ఓ మహిళ చేసిన న్యాయ పోరాటం ఫలించింది.. మృతదేహం పూడ్చిన 100 రోజుల తర్వాత బయటకు తీసి భార్యకు ఇచ్చారు. ఘటన వివరాల్లోకి వెళితే. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సంజీవ్ కుమార్ గత 23 ఏళ్లుగా సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. జనవరి 24న తేదీన గుండెపోటు రావడంతో అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే అతడు పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు.

ఆసుపత్రి సిబ్బంది పోలీస్ వారికీ సమాచారం ఇవ్వడంతో వారు ముస్లిం పద్దతిలో మృతదేహాన్ని ఖననం చేశారు. ఆసుపత్రి రికార్డులలో కూడా ముస్లిం పేరుమీదే అడ్మిట్ చేశారు. తన భర్తను ముస్లిం పద్దతిలో ఖననం చేయడాని భార్య అంజుశర్మ వ్యతిరేకించింది. తన భర్త మృతదేహాన్ని అప్పగించాలని సౌదీ అధికారులను కోరింది. దానికి వారు ఒప్పుకోలేదు. దీంతో ఆమె నయపోరాటానికి దిగారు. తెలంగాణకు చెందిన ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం సహకారంతో ఢిల్లి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

కేసును విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు సంజీవ్ కుమార్ మృతదేహాన్ని ఆయన భార్యకు అప్పగించాలని తీర్పు వెలువరించారు. దీంతో సౌదీ ప్రభుత్వం మృతదేహాన్ని పూడ్చిన 100 రోజుల తర్వాత బయటకు తీసి కార్గో విమానంలో బుధవారం ఢిల్లీ ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న ఎయిర్ పోర్ట్ అధికారులకు మృతదేహం అప్పచెప్పారు.

ఇక్కడి అధికారులు మృతదేహాన్ని భార్యకు అప్పగించారు. ఆమె మృతదేహం తీసుకోని హిమాచల్ ప్రదేశ్ లోని సొంత గ్రామానికి వెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు.  కాగా భర్త కోసం అంజుశర్మ చేసిన పోరాటాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. కరోనా సమయంలో ప్రజా రావణాకే అనుమతి లేనప్పటికీ అధికారులు చొరవ తీసుకోని మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చారు.