Trump Back On Twitter: ట్విటర్‌లోకి ట్రంప్ రీఎంట్రీ.. భారత్‌లో నిషేధానికి గురైన ప్రముఖుల ఖాతాలను కూడా పునరుద్దరిస్తారా?

వివాదాస్పద ట్వీట్లు చేశారంటూ భారత్‌లో పలువురి ప్రముఖ వ్యక్తుల ఖాతాలపై గతంలో ట్విటర్ బ్యాన్ విధించింది. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్ ఉన్నారు. అదేవిధంగా ప్రసిద్ధ యూట్యూబర్ PewDiePie, అభిజీత్ భట్టాచార్య, కమల్ రషీద్ ఖాన్ లతో పాటు పలువురు ఉన్నారు.

Trump Back On Twitter: ట్విటర్‌లోకి ట్రంప్ రీఎంట్రీ.. భారత్‌లో నిషేధానికి గురైన ప్రముఖుల ఖాతాలను కూడా పునరుద్దరిస్తారా?

Elon Musk

Trump Back On Twitter: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతా మళ్లీ మనుగడలోకి వచ్చింది. 2020 నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు ట్విటర్ ప్రకటించింది. ట్రంప్ ట్వీట్లు విద్వేషాలు రెచ్చగొట్టేవిలా ఉన్నాయని, మరింత హింస జరగకుండా ఉండేందుకే ట్రంప్ ట్విటర్ ఖాతాను రద్దు చేసినట్లు అప్పటి ట్విటర్‌లో న్యాయ నిపుణురాలైన భారతీయ అమెరికన్ విజయ గద్దె తెలిపారు.

Trump’s Twitter Account: ట్రంప్ ట్విట్టర్‌ ఖాతాను పునరుద్ధరించిన మస్క్.. ఫాలోవర్లు మాత్రం..

ప్రస్తుతం ట్విటర్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ట్రంప్ ఖాతాను పునరుద్దరించాలా? వద్దా? అని మస్క్ పోల్ నిర్వహించారు. వీరిలో 51.18 శాతం ట్రంప్ ఖాతా పునరుద్దరణకు అనుకూలంగా ఓటువేశారు. దీంతో ఆదివారం ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ అధికారిక ఖాతాను పునరుద్దరించారు. ట్విటర్ నుంచి ట్రంప్ తరహాలో నిషేధానికి గురైన పలువురు ప్రముఖ భారతీయ వ్యక్తులుకూడా ఉన్నారు. ప్రస్తుతం వారి ఖాతాలనుకూడా మస్క్ పునరుద్దరిస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

#RIPTwitter : రాజీనామాలతో కొత్త బాస్‌కు షాకిచ్చిన ట్విట్టర్ ఉద్యోగులు.. #RIPTwitter అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్..!

వివాదాస్పద ట్వీట్లు చేశారంటూ భారత్‌లో పలువురి ప్రముఖ వ్యక్తుల ఖాతాలపై గతంలో ట్విటర్ బ్యాన్ విధించింది. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్ ఉన్నారు. అదేవిధంగా ప్రసిద్ధ యూట్యూబర్ PewDiePie, అభిజీత్ భట్టాచార్య, కమల్ రషీద్ ఖాన్ లతో పాటు పలువురు ఉన్నారు. పదేపదే నిబంధనలను ఉల్లంఘించినందుకు కంగనా ట్విటర్ ఖాతాను రద్దు చేశారు. ప్రస్తుతం ట్విటర్ మస్క్ చేతుల్లోకి వెళ్లడంతోపాటు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పంచుకొనే వీలు కల్పిస్తున్నట్లు మస్క్ మొదటి నుంచి చెబుతున్నారు. దీంతో మస్క్ భారత్‌లో రద్దు చేయబడిన ప్రముఖుల ఖాతానులసైతం పునరుద్దరిస్తారా? లేదా? అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. భారత్ దేశంలో ఆగస్టు 26, సెప్టెంబర్ 25 మధ్య కాలంలో ట్విటర్ నిబంధనలు అతిక్రమించిన 52,141 ఖాతాలను ట్విట్టర్ నిషేధించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు 1,982 ఖాతాలను నిషేధించింది. ఉగ్రవాదం, పిల్లల లైంగిక దోపిడీని ప్రోత్సహించడం, ఇంత వివాదాస్పద ట్వీట్లు చేస్తున్న వారిపై ట్విటర్ బ్యాన్ విధించింది.