డిసెంబర్-13న ఏం జరుగనుంది…త్రిపుర సీఎం రాజీనామా ఖాయమా?

  • Published By: venkaiahnaidu ,Published On : December 8, 2020 / 10:30 PM IST
డిసెంబర్-13న ఏం జరుగనుంది…త్రిపుర సీఎం రాజీనామా ఖాయమా?

Will Biplab Deb step down as Tripura CM? త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్-13న తాను అగర్తలాలోని వివేకానంద స్టేడియంకి వెళ్లి తాను సీఎంగా కొనసాగాలా,వద్దా అని త్రిపుర ప్రజలను అడుగుతానని తెలిపారు. ఒకవేళ ప్రజలు తనకు మద్దతు తెలుపకపోతే..పార్టీ హైకమాండ్ కు విషయాన్ని తెలియజేస్తానని తెలిపారు. ప్రజలు తనకు మద్దతివ్వకపోతే సీఎంగా రాజీనామా చేస్తానంటూ పరోక్షంగా తెలిపారు బిప్లబ్ దేబ్. ఆదివారం నాటి ఘటన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.



కాగా, బీజేపీ జాతీయ కార్యదర్శి మరియు త్రిపుర రాజకీయ పరిశీలకుడు వినోద్ కుమార్ సోన్ కర్ ఆదివారం అగర్తలాలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో పార్టీ నాయకులు,ఎమ్మెల్యేలతో సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, ఇదే సమయంలో స్టేట్ గెస్ట్ హౌస్ బయట అధికార పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి “బిప్లబ్ హఠావో,బీజేపీ బచావో” నినాదాలు చేసిన విషయం తెలిసిందే.



గెస్ట్ హౌస్ లో మీటింగ్ తర్వాత వినోద్ కుమార్ సోన్ కర్ బయటకు వెళ్లే సమయంలో పార్టీ కార్యకర్తలు ఆయనని అడ్డుకున్నారు. కొద్దిసేపు ఆయన వాహనాన్ని కూడా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని సోన్ కర్ కాన్వాయ్ ని పార్టీ కార్యాలయానికి భద్రతతో తీసుకెళ్లారు.



ఆదివారం మధ్యాహ్నాం అగర్తలా నుంచి ఢిల్లీ బయలుదేరేముందు ముందు సోన్ కర్ మాట్లాడుతూ… పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని తెలిపారు. అయితే, కేబినెట్ విస్తరణ,వ్యవస్థాపక పునరుద్దరణ వంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయని,మంత్రులు,ఎమ్మెల్యేలు,పార్టీ నాయకులతో అనన్ి విషయాలను చర్చించానని,త్రిపురలో పార్టీని బలపర్చేందుకు మరియు ప్రభుత్వానికి పార్టీకి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండటం కోసం భవిష్యత్ లో కూడా చర్చలు కొనసాగుతాయని తెలిపారు.