Sanjay Raut: 24 గంటల్లో తిరిగొస్తే ఆలోచిస్తాం: రెబల్ ఎమ్మెల్యేలకు సంజయ్ రౌత్ ఆఫర్

శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజాగా శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేశారు.

Sanjay Raut: 24 గంటల్లో తిరిగొస్తే ఆలోచిస్తాం: రెబల్ ఎమ్మెల్యేలకు సంజయ్ రౌత్ ఆఫర్

Sanjay Raut

Sanjay Raut: మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) నుంచి శివసేన బయటకు రావాలంటే తిరుగుబాటు ఎమ్మెల్యేలు 24 గంటల్లో ముంబై రావాలని సూచించారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్. అప్పుడే ఎంవీఏ నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

Agniveer: అగ్నివీర్‌లకు ఏ ఉద్యోగాలిస్తారు? ఆనంద్ మహీంద్రాకు ఆర్మీ మాజీ ఉద్యోగి ప్రశ్న

శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజాగా శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన షిండే ప్రస్తుతం అసోంలోని గువహటిలో ఉన్నారు. దీంతో ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని మహా సర్కార్ ఇప్పుడు సంక్షోభంలో పడింది. ‘‘మీకు పార్టీతో ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోండి. కానీ, పార్టీని వీడబోమని హామీ ఇవ్వండి. అప్పుడు ఎంవీఏ నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. అది కూడా మీరు 24 గంటల్లోనే తిరిగి రండి. ఉద్ధవ్ థాక్రే ముందు మీ ధైర్యాన్ని చాటుకోండి’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

Agnipath: అగ్నిపథ్ నిరసనలు.. రైల్వేకు వెయ్యి కోట్ల నష్టం

తాజాగా తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒకరైన సంజయ్ సిరాసత్ సీఎంకు ఒక లేఖ రాశారు. ‘‘మేం సీఎంను కలవడానికి చాలా కష్టపడుతుంటే కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు మాత్రం సులభంగా కలుస్తున్నారు. వాళ్ల నియోజకవర్గానికి కావాల్సిన పనులు చేయించుకునేందుకు నిధులు పొందుతున్నారు. కానీ, మాకు మాత్రం ఆ అవకాశం లేదు’’ అని ఆ లేఖలో వివరించారు. తాజా సంక్షోభంలో షిండే వైపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు అంచనా ఉండగా, ఉద్ధవ్ థాక్రే వైపు మాత్రం 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.