Tollywood Success : టాలీవుడ్ సక్సెస్ ని ఈ ఇద్దరు హీరోలు కంటిన్యూ చేస్తారా..?

థియేటర్స్ కి జనాలు రాక వరస ఫ్లాపులతో సతమతమవుతున్న తెలుగు సినీ పరిశ్రమకు బింబిసార, సీతారమం ఇచ్చిన రిజల్ట్ ఫిలింమేకర్స్ లో ఊపిరి పోసింది. కంటెంట్ బాగుంటే...........

Tollywood Success : టాలీవుడ్ సక్సెస్ ని ఈ ఇద్దరు హీరోలు కంటిన్యూ చేస్తారా..?

nikhil and nithin

Tollywood Success :  గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ని పలకరిస్తున్న వరస ఫ్లాపుల వరదకు అడ్డుకట్ట పడింది. రీసెంట్ గా రిలీజ్ అయిన బింబిసార, సీతారామం సినిమాలు పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ఇంకేముంది ఇప్పుడు అందరి చూపు నెక్ట్స్ రాబోతున్న కార్తికేయ2, మాచర్ల నియోజకవర్గం సినిమాలపైనే పడుతోంది. ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుని, పీక్స్ ప్రమోషన్స్ తో అంచనాలు పెంచేసాయి ఈ సినిమాలు.

థియేటర్స్ కి జనాలు రాక వరస ఫ్లాపులతో సతమతమవుతున్న తెలుగు సినీ పరిశ్రమకు బింబిసార, సీతారమం ఇచ్చిన రిజల్ట్ ఫిలింమేకర్స్ లో ఊపిరి పోసింది. కంటెంట్ బాగుంటే థియేటర్స్ లోనూ సినిమాలు హిట్ అవుతాయని మరోసారి ప్రూవ్ అయింది.

నితిన్ కెరీర్ లోనే మాస్ యాక్షన్ సినిమాలు తక్కువ. ప్రస్తుతం పవర్ ఫుల్ మాస్ సినిమాగా వస్తోన్న మాచర్ల నియోజకవర్గంతో నితిన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో అన్న క్యూరియాసిటీ ఆయన ఫ్యాన్స్ లోనే కాదు, తెలుగు ఆడియన్స్ అందరిలోనూ ఉంది. అంతే కాదు, నితిన్, కృతిశెట్టి మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అయ్యిందో చూడాలనుకుంటున్నారున జనాలు. ఇప్పుడు థియేటర్స్ లో మొదలైన విజయ పరంపరను నితిన్ కంటిన్యూ చేస్తాడన్న కాన్ఫిడెన్స్ తో సినీ పరిశ్రమ కూడా ఆగస్టు 12న ఈ సినిమా సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది.

Yash wife and children’s : యశ్ భార్య రాధికా పండిట్ వరలక్ష్మి వ్రతం.. యశ్ పిల్లలు ఎంత క్యూట్ ఉన్నారో..

 

8 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అడ్వెంచరస్ మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చి నిఖిల్ కెరీర్ లో నే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా కార్తికేయ నిలిచింది. దాంతో ఆ సినిమా సీక్వెల్ పైన భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కార్తికేయ 2 మేకింగ్ కోసం చాలా టైమ్ తీసుకున్న డైరెక్టర్ చందూ మొండేటి, ఈ సినిమాను ద్వారకా నగర రహస్యం నేపథ్యంలో అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రయిలర్ ఆకట్టుకోగా లేటెస్ట్ గా మరో ట్రయిలర్ తో ఈ సినిమా పైన సక్సెస్ హోప్స్ పెంచేశారు. ఆగస్టు 13న రిలీజ్ కానున్న కార్తికేయ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. దాంతో ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా విజయం సాధించి తెలుగు సినీ పరిశ్రమకు మరింత ఊపిరి పోస్తాయనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. మరి ఇవి టాలీవుడ్ కి ఎంత బూస్ట్ ఇస్తాయో తెలియాలంటే ఇంకో 5 రోజులు ఆగాల్సిందే.