Pawan Kalyan: బాలయ్యను పవన్ కళ్యాణ్ అందుకోగలడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా.....

Pawan Kalyan: బాలయ్యను పవన్ కళ్యాణ్ అందుకోగలడా?

Will Pawan Kalyan Beat Balakrishna Akhanda In Ott

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేయగా, సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఇటీవల కాలంలో ఇంత ఎనర్జిటిక్‌గా చూడలేదని పవన్ ఫ్యాన్స్ అన్నారు. ఇక మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. పవన్ కెరీర్‌లో ఈ సినిమా మరో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచింది.

అయితే ఈ సినిమా రిలీజైన నెల రోజులకు ఓటీటీ ప్లాట్‌ఫాంలో దర్శనమివ్వబోతుంది. మార్చి 25న ఈ సినిమాను ఆహా, డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూస్తారని, చూసిన వారు కూడా మళ్లీ చూస్తారని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. అయితే ఇది జరిగే పనేనా అంటున్నారు కొందరు సినీ క్రిటిక్స్. దీనికి బలమైన కారణం కూడా లేకపోలేదని వారు అంటున్నారు.

Bheemla Nayak Bike: ‘ఆహా’ బంపర్ ఆఫర్.. పవన్ బైక్ సొంతం చేసుకొనే ఛాన్స్!

ఇదొక రీమేక్ చిత్రం కావడంతో, చాలా మంది మలయాళ ఒరిజినల్ మూవీని ఈపాటికే చూసి ఉంటారు. ఇక మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ అవుతుండటంతో ఆ సినిమాను చూసేందుకే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి సమయంలో భీమ్లా నాయక్‌ను తీరిగ్గా ఇంట్లో కూర్చుని ఓటీటీలో ఎగబడి అయితే చూడరు అని వారు చెబుతున్నారు. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణను అందుకోలేడని వారు అంటున్నారు.

Akhanda: బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ హీరోల పోటీ!

బాలయ్య నటించిన అఖండ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు అందరూ ఇళ్లల్లో ఓటీటీలకు అతుక్కుపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయంగా నిలిచినా కూడా అఖండ చిత్రానికి అంతటా పాజిటివ్ మౌత్ టాక్ లభించింది. దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. అందుకే ఈ సినిమాను చూడని వారు, చూసినా మళ్లీ చూసేందుకు జనం ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అందుకే ఓటీటీలో రిలీజ్ అయిన 24 గంటల్లో ఏకంగా 1 మిలియన్ వ్యూస్ సాధించి అఖండ చిత్రం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, అఖండ రికార్డును బీట్ చేయగలదా అంటే అది సాధ్యం కాదని వారు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రికార్డును బద్దలు కొడతారా లేదా అనేది తెలియాలంటే మార్చి 25 వరకు వెయిట్ చేయాల్సిందే.