RaPo: మార్కెట్ పెంచుకొనే పనిలో రామ్.. అరవసీమను ఆకట్టుకుంటాడా?

RaPo: మార్కెట్ పెంచుకొనే పనిలో రామ్.. అరవసీమను ఆకట్టుకుంటాడా?

Ram

RaPo: ఇప్పడు దక్షణాది హీరోలందరికీ పాన్ ఇండియా సినిమాల మీద దృష్టి పడింది. కేజీఎఫ్, బాహుబలితో మొదలైన ఈ హవాను ఎవరికి వారు.. వాళ్ళు కూడా నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ఇప్పుడు మార్కెట్ పెంచుకొనే పనిలో పడినట్లుగా కనిపిస్తుంది. రామ్ ప్రస్తుతం తమిళ మాస్ అండ్ స్టైలిష్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

పందెం కోడి, ఆవారా లాంటి సినిమాలతో మన తెలుగులో కూడా లింగుస్వామి సినిమాలకు క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే రామ్ లింగుస్వామికి ఒకే చెప్పినట్లుగా కనిపిస్తుంది. పనిలో పనిగా ఈ సినిమాను తమిళ, తెలుగు భాషలలో ద్విభాషా సినిమాగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాతో తమిళంలో కూడా రామ్ తన రేంజి పెంచుకోవాలని తపనపడుతున్నాడు. మరోవైపు డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు కూడా రామ్ బాగా పరిచయస్తుడే.

రామ్ ఇస్మార్ట్ శంకర్ బాలీవుడ్ లో డబ్బింగ్ ద్వారా బాగానే ఆకట్టుకుంది. యూట్యూబ్, ఓటీటీలలో కూడా రామ్ నార్త్ లో మంచి మార్కెట్ పెంచుకున్నాడు. ఇక ఇప్పుడు మిగిలింది బాలీవుడ్ ఎంట్రీ మాత్రమే. ఇప్పటికే తన పరిచయాలతో బాలీవుడ్ స్ట్రైట్ సినిమా చేసేందుకు కూడా రామ్ ప్రయత్నాలు చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ముందుగా లింగుస్వామి సినిమా ద్వారా తమిళంలో మార్కెట్ సంపాదించుకుంటే ఓ మెట్టు ఎక్కినట్లే. మరి అరవసీమను రామ్ ఆకట్టుకోగలడా అన్నదే చూడాల్సి ఉంది.