Apple iPhone: ఐఫోన్ స్లో అవుతుందా.. అయితే ఇలా చేయండి!

యాపిల్ కంపెనీ ఐ ఫోన్ అంటే ఆ క్రేజే వేరు. సెక్యూరిటీ పరంగా కానీ.. ఫీచర్స్ పరంగా కానీ ఐ ఫోన్ ఎప్పుడూ ముందు ఉంటుంది. అయితే.. ఎంత ఐ ఫోన్ అయినా అది కూడా ఎలక్ట్రానిక్ వస్తువే కదా.. అందుకే అందులో కూడా సమస్యలు ఎదురవుతుంటాయి. మరీ ముఖ్యంగా ఐఫోన్ లో తలెత్తే ప్రధాన సమస్య ఏంటంటే.. స్లో అవడం. ఐఫోన్ కొన్నాళ్ళు వాడిన అనంతరం స్లో అవుతూ ఉంటుంది.

Apple iPhone: ఐఫోన్ స్లో అవుతుందా.. అయితే ఇలా చేయండి!

Apple Iphone

Apple iPhone: యాపిల్ కంపెనీ ఐ ఫోన్ అంటే ఆ క్రేజే వేరు. సెక్యూరిటీ పరంగా కానీ.. ఫీచర్స్ పరంగా కానీ ఐ ఫోన్ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఇక కొందరు దీన్ని స్టేటస్ సింబల్ గా కూడా భావిస్తారు. అందుకే మిగతా అన్ని కంపెనీల ఫోన్స్ కంటే ధరలు అధికంగా ఉన్నా ఐ ఫోన్ కొత్త మోడల్ వస్తుందంటే చాలు జనాలు ఎగబడి మరీ కొంటుంటారు. అయితే.. ఎంత ఐ ఫోన్ అయినా అది కూడా ఎలక్ట్రానిక్ వస్తువే కదా.. అందుకే అందులో కూడా సమస్యలు ఎదురవుతుంటాయి. మరీ ముఖ్యంగా ఐఫోన్ లో తలెత్తే ప్రధాన సమస్య ఏంటంటే.. స్లో అవడం. ఐఫోన్ కొన్నాళ్ళు వాడిన అనంతరం స్లో అవుతూ ఉంటుంది.

ఏదైనా యాప్ ఓపెన్ చేయగానే స్లోగా ఓపెన్ అవుతుంటాయి. దీంతో యూజర్లకు ఇది చిరాకుగా అనిపిస్తుంది. అలా కాస్త సమయం కేటాయించి.. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు మీ ఐఫోన్ మళ్ళీ యధావిధిగా సూపర్ ఫాస్ట్ మోడ్ లో పనిచేస్తుంది. ముందుగా ఫోన్‌లో అన‌వ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు, మీడియా ఫైల్స్, కాష్ మెమోరీ, అన‌వ‌స‌ర‌మైన యాప్స్, ఫోన్‌లో బ్రౌజింగ్ చేసినపుడు వెబ్ సైట్ల‌కు చెందిన కాష్ మెమోరీ వంటి వాటిని గుర్తించి వాటిని తొలగించాలి.

ఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లి జ‌న‌ర‌ల్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేసి ఐఫోన్ స్టోరేజ్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయగానే ఐఫోన్ స్టోరేజ్ బ్రేక‌ప్ మొత్తం అక్క‌డ క‌నిపిస్తుంది. అప్పుడు అందులో మీకు అవ‌స‌రం లేని జంక్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోని వాటిని తొలగిస్తే ముందుగా ఫోన్ మెమోరీ ఫ్రీ అవుతుంది. దీంతోపాటు ఐఫోన్‌లోనే స్టోర్ అయిన డీఫాల్ట్‌గా ఫోన్‌కు వ‌చ్చిన మెసేజ్‌లు అలానే ఉండిపోవడం వలన కొన్ని రోజులకు మెసేజ్‌ల‌కే ఎక్కువ మెమోరీ తీసుకుంటుంది. అందుకే.. అవ‌స‌రం లేని మెసేజ్‌లను కూడా డిలీట్ చేస్తే మరింత మెమోరీ పెరుగుతుంది.

ఇక, బ్రౌజ‌ర్‌లో ఇంట‌ర్నెట్‌ను బ్రౌజ్ చేయ‌డం వ‌ల్ల‌.. కాష్ ఫైల్స్ బ్రౌజ‌ర్‌లో సేవ్ అవుతాయి. మరికొన్ని ఫోన్ మెమోరీలో కూడా స్టోర్ అవుతుంటాయి. కనుక బ్రౌజ‌ర్ కాష్‌ను క్లియ‌ర్ చేసుకోవాలి. దానికోసం స‌ఫారీ బ్రౌజ‌ర్ ఉప‌యోగించేవాళ్లు.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి స‌ఫారీని సెలెక్ట్ చేసుకొని క్లియ‌ర్ హిస్ట‌రీ అండ్ వెబ్ సైట్ డేటా అనే ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకొని స్పేస్‌ను క్లియ‌ర్ చేసుకోవాలి. రెగ్యుల‌ర్‌గా ఈ టిప్స్ ఫాలో అయితే.. మీ ఐఫోన్ ఎంచక్కా స్పీడ్ గా పనిచేస్తుంది.