monkeypox: ‘మంకీపాక్స్’.. మరో ‘కరోనా’ అవుతుందా?

కోవిడ్ తర్వాత ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వ్యాధి ‘మంకీ పాక్స్’. ఇప్పటికే ఇరవైకి పైగా దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇది ప్రారంభం మాత్రమే అని, భవిష్యత్తులో మరిన్ని దేశాలకు మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది.

monkeypox: ‘మంకీపాక్స్’.. మరో ‘కరోనా’ అవుతుందా?

monkeypox: కోవిడ్ తర్వాత ప్రపంచాన్ని వణికిస్తున్న మరో వ్యాధి ‘మంకీ పాక్స్’. ఇప్పటికే ఇరవైకి పైగా దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇది ప్రారంభం మాత్రమే అని, భవిష్యత్తులో మరిన్ని దేశాలకు మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఇది మశూచీ (స్మాల్‌పాక్స్‌) కుటుంబానికి చెందింది. దీన్ని శాస్త్రవేత్తలు 1958లో గుర్తించారు. కోతులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ వ్యాధి పెరగడం వల్ల దీన్ని ‘మంకీ పాక్స్’ అన్నారు. తర్వాత మానవుల్లో ఆఫ్రికా ఖండంలోని ‘కాంగో’లో 1970లలో దీన్ని కనుగొన్నారు. కాంగోతోపాటు ఆఫ్రికాలోని లైబీరియా, నైజీరియా, సియారాలియోనీ లాంటి దేశాల్లోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా ఖండాల్లోని అనేక దేశాల్లో మంకీ పాక్స్ కనిపిస్తోంది. ఆఫ్రికాకే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు ఇతర ఖండాలకు కూడా వ్యాపించడంతో ప్రపంచం ఆందోళన చెందుతోంది. పైగా ఇది వైరస్ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి.. ఇతర దేశాలకూ త్వరగానే సోకుతుందని అంచనా.

Bihar girl: పవర్ ఆఫ్ సోషల్ మీడియా.. బిహారీ బాలికకు కృత్రిమ కాలు

జ్వరం, ఒళ్లునొప్పులు, వీపునొప్పి, తీవ్రమైన అలసట, రాత్రిళ్లు చలిజ్వరంతో కూడిన వణుకు, లింఫ్‌ గ్లాండ్స్‌లో వాపు, ఒళ్లంతా దద్దుర్లు వంటివి మంకీ పాక్స్ లక్షణాలు. మంకీపాక్స్‌ వైరస్‌ సోకిన వ్యక్తికి తొలుత తీవ్రమైన జ్వరం వస్తుంది. కొందరిలో దగ్గు, తీవ్రమైన నిస్సత్తువ ఉంటుంది. ఇంకొన్నిసార్లు మలేసీ వంటి లక్షణాలూ ఉంటాయి. సాధారణంగా శరీరంలోకి వైరస్‌ ప్రవేశించాక దాన్ని ఎదుర్కొనేందుకు శరీరం సిద్ధమవుతుంది. దీనివల్లే లింఫ్ గ్లాండ్స్‌లో వాపు వస్తుంది. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత 2-4 రోజుల్లో ఒళ్లంతా దద్దుర్లు వంటివి వస్తాయి. ఆ దద్దుర్లు పెరిగి పుండ్లుగా కూడా మారవచ్చు. అవి ముఖం మీద, వీపు మీద.. ఇలా శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. కొన్నిసార్లు నోరు, ముక్కు, నాసికా రంధ్రాల్లోనూ రావొచ్చు. అలా అవి 14 రోజుల నుంచి 21 రోజుల పాటు పచ్చిగా ఉండి, క్రమంగా ఎండిపోతాయి. దాదాపు నాలుగు వారాల తర్వాత వ్యాధి తగ్గిపోతుంది. అయితే, చర్మంపై మచ్చలు మాత్రం చాలా రోజుల వరకు ఉంటాయి.

Monkeypox Treatment: మంకీపాక్స్ ట్రీట్మెంట్‌కు ట్రైనింగ్ తీసుకుంటున్న బెంగళూరు డాక్టర్లు
ఎలా వ్యాపిస్తుంది: ఈ వ్యాధి కోతుల నుంచి కొన్ని పెంపుడు జంతువుల్లోకి, అక్కడ్నుంచి క్రమంగా మనుషులకూ వ్యాప్తించి ఉండొచ్చని అంచనా. మనుషులకు సోకిన తర్వాత నోటి నుంచి వెలువడే తుంపరల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. వ్యాధి సోకిన వాళ్లు వాడే వస్తువులను తాకినా మంకీపాక్స్ వచ్చే అవకాశం ఉంది.
జాగ్రత్తలు: ఇది అంటువ్యాధి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది రోగి నుంచి జంతువులకు.. జంతువుల నుంచి తిరిగి మనుషులకూ సోకే అవకాశం ఉంది. అందువల్ల వ్యాధి ప్రబలుతున్న ప్రదేశాల్లో కొంతకాలం పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి. వ్యాధి గ్రస్తులకు ఇంట్లోని పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి. రోగిని ఐసోలేషన్‌లో ఉంచాలి. రోగికి దగ్గరగా ఉండి చికిత్స అందించినప్పుడు లేదా సాయపడినప్పుడు పీపీఈ కిట్లు ధరించడంతోపాటు శానిటైజర్ వాడాలి. కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, దాదాపు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉండదు.
చికిత్స: ప్రస్తుతానికి దీనికి నిర్దిష్టంగా మందులు లేవు. రోగి లక్షణాలను బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. అయితే కొన్ని యాంటీవైరల్‌ మందులను ఇందుకోసం వాడవచ్చనీ, మశూచీ కోసం వాడిన వ్యాక్సిన్‌ కూడా కొంతవరకు దీని తీవ్రతను తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మంకీపాక్స్ చికిత్సలో వాడే మందుల విషయంలో ప్రయోగాలు జరుగుతున్నాయి.

Monkeypox : మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్‌
కరోనాలా ప్రపంచాన్ని వణికిస్తుందా?
నిపుణుల అంచనా ప్రకారం మంకీ పాక్స్ కరోనా వ్యాధిలాగా తీవ్రంగా మారే అవకాశం లేదు. వ్యాధి సోకిన తర్వాత మందులు వాడటం ద్వారా తగ్గినప్పటికీ, దీనికి సంబంధించిన మచ్చలు అలాగే ఉండిపోతాయి. ఇది ప్రాణాంతకం కాదు కాబట్టి, కరోనాలాగా దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, ఇది కలిగించే దుష్ప్రభావాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి సోకకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.