CM KCR: హైదరాబాద్ వచ్చి నా ప్రభుత్వాన్నే కూలుస్తారా.. ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి: సీఎం కేసీఆర్

హైదరాబాద్ వచ్చి తన ప్రభుత్వాన్నే కూలుస్తానంటే చూస్తూ ఊరుకుంటానా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేల్ని కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తేలాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని కేసీఆర్ మీడియాతో పంచుకున్నారు.

CM KCR: హైదరాబాద్ వచ్చి నా ప్రభుత్వాన్నే కూలుస్తారా.. ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి: సీఎం కేసీఆర్

CM KCR: హైదరాబాద్ వచ్చి తన ప్రభుత్వాన్నే కూలుస్తానంటే చూస్తూ ఊరుకుంటానా అంటూ ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘గత నెలలో రామచంద్ర భారతి హైదరాబాద్ వచ్చారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.

CM KCR: బీజేపీ తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్

మొత్తానికి రోహిత్ రెడ్డిని కలిశారు. దీనిపై హోం మంత్రి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలో వాళ్లు అనేక విషయాలు చెప్పారు. 8 ప్రభుత్వాల్ని కూల్చాం. మరో 4 ప్రభుత్వాల్ని కూలుస్తాం. తెలంగాణ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాల్ని కూలగొడతామని చెప్పారు. ఈ ముఠా చిన్నది కాదు. 24 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 3, 4 ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు ఉంటాయి. ఈ వ్యవహారంలో పట్టుబడి జైలులో ఉన్నది తుషార్. అతడు బీజేపీ తరఫున రాహుల్ గాంధీపై పోటీ చేశారు. వీరికి ఫేక్ ఐడీ కార్డులు ఎలా వస్తాయి? దేశంలో తాము ఏం చేసినా ఎదురులేదనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి అరాచకాలను కొనసాగనివ్వం.

Bridegroom: అత్తింటివారు ఇచ్చిన కారుతో అత్తను ఢీకొట్టి చంపిన అల్లుడు

ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎమ్మెల్యేలను కొంటే ఇక ఎన్నికలు ఎందుకు? ఎమ్మెల్యేలను కొని మా ప్రభుత్వాన్నే కూలుస్తామంటే మేం చూస్తూ ఊరుకోవాలా? ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ హేయమన చర్యను, అరాచకాన్ని నేను చూస్తూ భరించేది లేదు. దేశంలో ఇబ్బందికర పరిస్థితులున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక ఎవరెవరున్నారో చెబుతున్నారు. బీఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నద్దా దీని వెనుక ఉన్నారని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వాన్ని ఎలా కూల్చారో ధైర్యంగా చెప్పారు. రూ.100 కోట్లు ఇచ్చేందుకైనా మేం సిద్ధం అని బహిరంగంగా చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఎంతైనా పెట్టేందుకు రెడీ. వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. సమకూరుస్తోంది ఎవరు? ఇది పెద్ద క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్’’ అంటూ సీఎం కేసీఆర్ అన్నారు.