లిక్కర్ షాప్స్ ఓపెన్ : ఒకరు కొబ్బరికాయ కొట్టారు..మరొకరు బాంబులు పేల్చారు

  • Published By: madhu ,Published On : May 4, 2020 / 10:28 AM IST
లిక్కర్ షాప్స్ ఓపెన్ : ఒకరు కొబ్బరికాయ కొట్టారు..మరొకరు బాంబులు పేల్చారు

తమ అభిమాన హీరో, హీరోయిన్స్ సినిమా విడుదలైతే..ఎలా ఉంటుంది సంబరాలు. థియేటర్స్ లో మాములుగా ఉండదు కదా.. అభిమాన హీరో కటౌట్ కి పూల మాలల వేస్తూ..డప్పు వాయిద్యాలు నడుమ..విజిల్స్ వేసుకుంటూ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి సీన్స్ కనిపిస్తోంది.

డప్పు వాయిద్యాలు, కటౌట్ లు కనిపించడం లేదు కానీ..కొబ్బరి కాయలు కొట్టడం, హారతులు ఇవ్వడం, బాంబులు పేల్చడం కనిపించాయి. అరే..ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది కదా..మరి ఇదేంటీ అనుకుంటున్నారా… దాదాపు 40 రోజుల తర్వాత…వైన్స్ షాపులు ఓపెన్ అయ్యాయి. దీనితో మందుబాబుల ఆనందానికి అవధులుంటాయా ? 

కరోనా రాకాసి కారణంగా భారతదేశంలో 2020, మార్చి 24వ తేదీ నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. కేంద్రం పలు దఫాలుగా పొడిగించింది. ప్రస్తుతం మే 17 వరకు (మూడో సారి) పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కొన్నింటికి సడలింపు ఇచ్చింది. అందులో వైన్స్ షాపులు (గ్రీన్, ఆరెంజ్ ) ఉన్నాయి.

ఇక మందుబాబులు ఫుల్ ఖుష్ అయిపోయారు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే..2020, మే 04వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు లిక్కర్ షాపులు ఓపెన్ కాగానే..మద్యంబాబులు సంతోష పడిపోయారు. 

వైన్స్ షాపు ముందు కొబ్బరి కాయలు కొట్టారు… పూజలు చేశారు. మరికొంత మంది బాణాసంచా కాల్చుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పట్టరాని సంతోషంతో ఉన్న వారు..ఏకంగా డ్యాన్సులు చేశారు. కర్నాటక రాష్ట్రంలో మందుబాబులు టపాసులు పేలుస్తూ..ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

 

Also Read |  ఒకే ఒక్క క్వార్టర్ దేవుడా : మందుబాబుల వేడుకోలు