Strawberries : జుట్టు ఒత్తుగా, పొడవుగా ఎదగడానికి స్ట్రాబెర్రీలతో!

స్ట్రాబెర్రీలో విటమిన్, ఫైబర్,పాలీఫెనాల్స్ తో పాటు పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండులో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి 9 పుష్కలంగా ఉన్నాయి. జుట్టు ఆరోగ్యానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

Strawberries : జుట్టు ఒత్తుగా, పొడవుగా ఎదగడానికి స్ట్రాబెర్రీలతో!

Strawberries : చిన్నవిగా, ఎరుపు రంగులో ఉండే స్టాబెర్రీలు ఎంతో రుచికరంగా ఉండటంతో చాలా మంది ఇష్టంగా తింటారు. స్ట్రాబెర్రీలో విటమిన్, ఫైబర్,పాలీఫెనాల్స్ తో పాటు పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండులో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి 9 పుష్కలంగా ఉన్నాయి. జుట్టు ఆరోగ్యానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ మాయిశ్చరైజ్డ్‌గా , పట్టులా మెరవాలని కోరుకునే వారు దీనికోసం స్ట్రాబెర్రీ హెయిర్ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు కోసం స్ట్రాబెర్రీలతో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం…

స్టాబెర్రీలతో హెయిర్ ప్యాక్ ;

ఇందుకోసం ముందుగా కొన్ని స్ట్రాబెర్రీలు తీసుకొని అందులో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత.. ఈ మిశ్రమంలో గుడ్డులోని పచ్చ సొన వేసి బాగా కలుపుకోవాలి. మెత్తని బ్రష్ ఉపయోగించి ఈ మాస్క్‌ని మీ జుట్టు కుదుళ్లకు పట్టించాలి. కుదుళ్లకు పట్టించాక మిగిలిన మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. మాస్క్ వేసుకున్న తర్వాత ఇరవై నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత జుట్టును చల్లని నీటితో కడుక్కోవాలి. నెలలో రెండు పర్యాయాలు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.