Massage in Jail: జైలులో హాయిగా మసాజ్ చేయించుకున్న మంత్రి సత్యేందర్ జైన్.. వీడియో వైరల్

అక్రమ నగదు చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఢిల్లీలోని తిహార్ జైలులో ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ అందులో హాయిగా మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పలువురు బీజేపీ నేతలు పోస్ట్ చేశారు. 2015-16లో కోల్‌క‌తాలోని స‌త్యేంద‌ర్ జైన్ సంస్థ‌లకు సంబంధించిన‌ న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసుల్లో విచార‌ణ జ‌రుగుతోంది.

Massage in Jail: జైలులో హాయిగా మసాజ్ చేయించుకున్న మంత్రి సత్యేందర్ జైన్.. వీడియో వైరల్

Massage in Jail

Massage in Jail: అక్రమ నగదు చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఢిల్లీలోని తిహార్ జైలులో ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ అందులో హాయిగా మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పలువురు బీజేపీ నేతలు పోస్ట్ చేశారు. 2015-16లో కోల్‌క‌తాలోని స‌త్యేంద‌ర్ జైన్ సంస్థ‌లకు సంబంధించిన‌ న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసుల్లో విచార‌ణ జ‌రుగుతోంది.

ఆయ‌న‌ 2017 నుంచి విచార‌ణ ఎదుర్కొంటున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ సత్యేందర్ జైన్ కు సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ తిహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను ఇటీవలే అధికారులు సస్పెండ్ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన విచారణ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు సత్యేందర్ జైన్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం. సత్యేందర్ జైన్ తాను ఉంటోన్న సెల్ లోనే ఒకరితో కాళ్లు, వీపు, తలకు మసాజ్ చేయించుకుంటున్నట్లు ఈ వీడియో ఉంది. ఆ మంత్రి అవినీతికి పాల్పడినప్పటికీ సీఎం కేజ్రీవాల్ ఆయనకు మద్దతు తెలుపుతున్నారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.


10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..