Bombay HC : మహిళ కేవలం చదువుకున్నందున..ఉద్యోగం చేయమని బలవంతం చేయబడదు : హైకోర్టు

మహిళ చదువుకుందన్న కారణంగా కచ్చితంగా ఉద్యోగం చేయాలన్న నిబంధన లేదని..చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం చేసి తీరాలని ఆమెను ఒత్తిడి చేయకూడదని ముంబై హైకోర్టు ఆసక్తికర తీర్పునిచ్చింది.

Bombay HC : మహిళ కేవలం చదువుకున్నందున..ఉద్యోగం చేయమని బలవంతం చేయబడదు : హైకోర్టు

Woman Can't Be Compelled To Go Job Because She Is Graduate..says Bombay High Court (1)

Bombay High Court : మహిళ చదువుకుందన్న కారణంగా కచ్చితంగా ఉద్యోగం చేయాలన్న నిబంధన లేదని..చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం చేసి తీరాలని ఆమెను ఒత్తిడి చేయకూడదని ముంబై హైకోర్టు ఆసక్తికర తీర్పునిచ్చింది. ఓకేసు తీర్పు సందర్భంగా శుక్రవారం (6,2022) ముంబయి హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేవలం ఒక మహిళ ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హతలు కలిగి ఉందన్న కారణంగా ఆమె కచ్చితంగా ఉద్యోగం చేయాలని.. ఇంట్లో ఉండకూడదని అర్థం కాదని జస్టిస్‌ భారతి డాంగ్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చదువుకున్నా..ఉద్యోగం చేయడం అనేది మహిళ ఇష్టంతో కూడుకున్నదని తేల్చి చెప్పారు. ఉద్యోగం చేయాలా? వద్దా? అనే విషయం ఆమె ఎంపిక మాత్రమేనని అన్నారు. గ్రాడ్యుయేట్‌ అయినంత మాత్రాన ఆమె ఇంటి వద్ద కూర్చోవడానికి వీలులేదనే వాదన సరైంది కాదని జస్టిస్ భారతీ డాంగ్రే అన్నారు. పూణెలోని ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను జస్టిస్ భారతి డాంగ్రేతో కూడిన సింగిల్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా.. స్థిరమైన ఆదాయాన్ని పొందుతోన్న ఓ భార్య తన భర్త నుంచి భరణం కోరిందన్న కేసు విచారణలో భాగంగా జస్టిస్‌ భారతి ఈ వ్యాఖ్యలు చేశారు.

వివరాల్లోకి వెళితే.. 2010లో ఓ జంట వివాహం చేసుకుంది. అయితే 2013 నుంచి వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. కూతురు తల్లితో ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు భర్త నుంచి మెయింటెనెన్స్‌ కావాలని సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. ఫ్యామిలో కోర్టులో తనతో పాటు తన కూతురు జీవనానికి సరిపడ డబ్బు భర్త నుంచి అందించాలని దాఖలు పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో కోర్టు భార్యకు నెలకు రూ. 5000, చిన్నారి పోషణ కోసం రూ. 7,000 చెల్లించాని తీర్పునిచ్చింది. అయితే దీనిపై సదరు భర్త .. తన భార్య ఉద్యోగం చేస్తోందని, తనకు ఆదాయ మార్గం లేదని తప్పుడు సమాచారంతో పిటిషన్‌ దాఖలు చేసిందని సవాలుగా మరో పిటిషన్‌ దాఖలు చేశాడు.

ఈ క్రమంలో శుక్రవారం విచారణకు వచ్చిన ఈ కేసు విషయంలో జస్టిస్‌ భారతి డాంగ్రే ఈ వ్యాఖ్యలు చేశారు. పని చేయాలా వద్దా అన్నది మహిళ హక్కు అని.. ఆమె గ్రాడ్యుయేట్‌ అయినంత మాత్రన పనిచేయకూడదనే నిబంధన ఏముంది అంటూ ప్రశ్నించారు. ఇక తనను తాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. ‘ఈరోజు నేను జడ్జిని, రేపు నేను ఇంట్లో కూర్చుంటాననుకోండి. ‘నీకు న్యాయమూర్తి అయ్యే అర్హత ఉంది..ఇంట్లో కూర్చోకూడదని చెబుతారా’ అని జస్టిస్‌ భారతి ప్రశ్నించారు.