పెళ్లి పేరుతో రూ.కోటి కొట్టేసింది, 73ఏళ్ల వృద్ధుడికి బ్యాంకు ఉద్యోగిని టోకరా

ఆ వృద్ధుడి పేరు జెరాన్‌ డిసౌజా. వయసు 73ఏళ్లు. మలద్‌ ప్రాంతంలో నివాసం ఉంటాడు. 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని జెరాన్ విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేట్ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాడు. 2019లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్, దానిపై వడ్డీ రూపంలో భారీ అమౌంట్ వచ్చింది. ఆ నగదును జెరాన్ విత్ డ్రా చేశాడు. అదే బ్యాంక్‌లో పనిచేస్తున్న షాలినీ సింగ్ ఈ విషయం గమనించింది. ముసలోడి డబ్బుపై ఆమె కన్నుపడింది.

పెళ్లి పేరుతో రూ.కోటి కొట్టేసింది, 73ఏళ్ల వృద్ధుడికి బ్యాంకు ఉద్యోగిని టోకరా

Woman cheats 73-Year-Old Man Marriage: అసలే వృద్ధుడు. వయసు 73ఏళ్లు. ఒంటరి వాడు. పైగా రూ.2కోట్ల ఆస్తి. ఇంకేముంది.. ఆ కిలేడీ కన్ను ఆ వృద్దుడి డబ్బుపై పడింది. అతడితో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత పెళ్లి ఆశ చూపింది. వృద్ధాప్యంలో తోడుగా ఉంటానని ఒట్టేసింది. ఆపై కోటి రూపాయలు నొక్కేసి జంప్ అయ్యింది. తాను మోసపోయానని తెలిసి ముసలోడు లబోదిబోమంటున్నాడు. ముంబైలో ఈ ఘటన జరిగింది.

ఆ వృద్ధుడి పేరు జెరాన్‌ డిసౌజా. వయసు 73ఏళ్లు. మలద్‌ ప్రాంతంలో నివాసం ఉంటాడు. 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని జెరాన్ విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేట్ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాడు. 2019లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్, దానిపై వడ్డీ రూపంలో భారీ అమౌంట్ వచ్చింది. ఆ నగదును జెరాన్ విత్ డ్రా చేశాడు. అదే బ్యాంక్‌లో పనిచేస్తున్న షాలినీ సింగ్ ఈ విషయం గమనించింది. ముసలోడి డబ్బుపై ఆమె కన్నుపడింది.

జెరాన్‌ విత్ డ్రా చేసిన డబ్బుని ఎలాగైనా కొట్టేయాలని స్కెచ్ వేసింది. అతడితో పరిచయం పెంచుకుంది. ప్రేమగా మాట్లాడింది. ఆ తర్వాత వివాహం చేసుకుంటానని మాటిచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తనకు తోడు దొరికిందని డిసౌజా సంబరపడిపోయాడు. ఇద్దరూ కలిసి రెస్టారెంట్లకు, షికార్లకు తిరిగారు.

డిసౌజా తన బుట్టలో పడ్డాడని నిర్ధారించుకున్న తర్వాత, కిలేడీ షాలినీ తన ప్లాన్ అమలు చేసింది. మెల్లగా తన మనసులోని మాట బయటపెట్టింది. తనొక వ్యాపారం ప్రారంభిస్తున్నానని, అందులో పెట్టుబడి పెట్టాలని జెరాన్‌ను కోరింది. లాభాలు చెరి సగం తీసుకుందామని నమ్మబలికింది. కాబోయే భార్యే కదా గుడ్డి నమ్మకంతో పెట్టుబడి పెట్టేందుకు డిసౌజా ఓకే చెప్పాడు. 2020 డిసెంబర్‌లో షాలినీ అకౌంట్‌కు రూ.1.30కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు.

అంతే, నగదు తన అకౌంట్లో పడగానే షాలినీ అసలు రూపం బయటపెట్టింది. తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకుంది. దీంతో జెరాన్ కంగుతిన్నాడు. ఆమెను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. లాభం లేకపోయింది. దీంతో తాను మోసపోయాయని తెలుసుకున్న ముసలోడు లబోదిబోమన్నాడు. షాలినీ పని చేసే బ్యాంకు అంధేరీ పరిధిలో ఉండటంతో.. అక్కడి పోలీసులను ఆశ్రయించాడు. జరిగిందంతా చెప్పి న్యాయం చేయాలని కోరాడు. గత(2020) డిసెంబర్‌లోనే డిసౌజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు పరిశీలించిన పోలీసులు మోసం జరిగినట్లు నిర్ధారించారు. డిసౌజా ఫిర్యాదు చేసి 3 నెలల తర్వాత ఇటీవలే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.