Cheating Boyfriend: మోసం చేశాడని బాయ్‌ఫ్రెండ్‌ను కారుతో తొక్కించిన యువతి.. చనిపోయినట్లు తెలుసుకొని..

తనను మోసం చేశాడని అనుమానించిన 26ఏళ్ల యువతి ప్రియుడ్ని తాళ్లతో కట్టేసి కారుతో తొక్కించింది. పలు సార్లు కారుతో తొక్కించడంతో ప్రియుడు ప్రాణాలు వదిలాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లి యువతి అతడితో ఉన్న మరో యువతిపైనా దాడి చేసింది. పోలీసులు అప్రమత్తమై ..

Cheating Boyfriend: మోసం చేశాడని బాయ్‌ఫ్రెండ్‌ను కారుతో తొక్కించిన యువతి.. చనిపోయినట్లు తెలుసుకొని..

Andre Smith

Cheating Boyfriend: తనను మోసం చేశాడని అనుమానించిన 26ఏళ్ల యువతి ప్రియుడ్ని కారుతో తొక్కించింది. పలు సార్లు కారుతో తొక్కించడంతో ప్రియుడు ప్రాణాలు వదిలాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లి యువతి అతడితో ఉన్న మరో యువతిపైనా దాడి చేసింది. పోలీసులు అప్రమత్తమై యువతిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రియుడు హత్యకు కారణమైన యువతిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో చోటు చేసుకుంది. గతకొంతకాలంగా 26ఏళ్ల గేలిన్ మోరిస్, ఆండ్రీ స్మిత్ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆండ్రీ స్మిత్ కనిపించక పోవటంతో అనుమానం వచ్చిన మోరిస్ ఎక్కడ ఉన్నాడని ఆరా తీసింది. అసలు విషయం తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయింది.

Husband Kills Wife : హైదరాబాద్‌లో దారుణం.. భార్యను చంపి ముక్కలు చేసి డ్రమ్‌లో దాచిన భర్త

తన ప్రియుడు స్మిత్ తనను మోసం చేశాడని అనుమానం బలపడటంతో అతన్ని వెతుకుంటూ వెళ్లింది. ఆపిల్ ఫోన్ లోని ఎయిర్ ట్యాగ్ ద్వారా అతడి కదలికలను ట్రాక్ చేయసాగింది. ఓ బార్ వద్ద స్మిత్ వేరే యువతితో ఉండటాన్ని గేలిన్ మోరిస్ గుర్తించింది. ఆవేశంతో వెళ్లి ఖాళీ వైన్ బాటిల్ తో స్మిత్ వెంట ఉన్న యువతిపై దాడికి యత్నించింది. అప్రమత్తమైన ఆండ్రీ స్మిత్.. మోరిస్ ను అడ్డుకున్నాడు. స్మిత్ తో వాదులాటకు దిగి.. అతన్ని రోడ్డుపడేసి కొట్టింది. దీంతో అతడు రోడ్డుపై పరుగెత్తుతున్న క్రమంలో కారుతో ఢీకొట్టి తొక్కించింది. అలా పలుమార్లు స్మిత్ ను కారుతో తొక్కించింది. అయినా కోపం తగ్గకపోవటంతో ఓ రెస్టారెంట్ వద్ద ఫుడ్ ఆర్డ్ ర్ కోసం వేచియున్న యువతిపై గేలిన్ మోరిస్ దాడికి యత్నించింది. అక్కడే ఉన్న పోలీసులు గేలిన్ మోరిస్ ను అదుపులోకి తీసుకున్నారు.

Bear Kills Couple : గుడిలో ప్రార్థనలు చేస్తుండగా ఘోరం.. దంపతులను చంపి తిన్న ఎలుగుబంటి

ప్రియురాలు కారుతో తొక్కించడంతో తీవ్రంగా గాయపడ్డ ఆండ్రీ స్మిత్ ను పోలీసులు చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే స్మిత్ చనిపోయినట్లు గుర్తించారు. దీంతో స్మిత్ మృతికి కారణమైన గేలిన్ మోరిస్ ను పోలీసులు అరెస్టు చేశారు. పలువురు సాక్షులను విచారించిన పోలీసులు. స్మిత్.. బార్ నుంచి బయటకు వెళ్తుండగా కారుతో గేలిన్ మోరిస్ ఢీకొట్టినట్లు నిర్ధారించారు.