Viral Reply: తోటమాలిగా పనిచేయటానికి బాడీబిల్డర్ కావలెను..దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన మహిళ

ఓ కంపెనీ తోటమాలిగా పనిచేయటానికి బాడిబిల్డర్ కావలెను అంటూ ప్రకటన ఇచ్చింది. ఈ ఉద్యోగానికి చార్లెట్ అనే మహిల దరఖాస్తు చేసుకుంది. ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తోంది. ఈక్రమంలో చార్లెట్ కు సదరు కంపెనీ నుంచి ఓ విచిత్రమైన సమాధానం వచ్చింది. ఆ సమాధానికి ఆమె ఇచ్చిన కౌంటర్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Reply: తోటమాలిగా పనిచేయటానికి బాడీబిల్డర్ కావలెను..దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన మహిళ

Neelakurinkji (6)

woman sends scathing reply after rejected from job : ఎన్నో రకాల ఉద్యోగాలకు సంబంధించి ప్రకటనలు చూసి ఉంటాం.కొన్ని విచిత్రమైనవి కూడా చూసే ఉంటాం. అటువంటిదే ఓ ఉద్యోగ ప్రకటనకు ఓ మహిళ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఏంటా ఉద్యోగం..ఇష్టం లేకపోతే మానేయాలి గానీ కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏంటో తెలుసుకుందాం.

ఓ కంపెనీ తోటమాలిగా పనిచేయటానికి బాడిబిల్డర్ కావలెను అంటూ ప్రకటన ఇచ్చింది. ఈ ఉద్యోగానికి చార్లెట్ అనే మహిల దరఖాస్తు చేసుకుంది. ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తోంది. ఈక్రమంలో చార్లెట్ కు సదరు కంపెనీ నుంచి ఓ విచిత్రమైన సమాధానం వచ్చింది. ‘‘ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు. కానీ మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోలేం.ఎందుకంటే మీరు బాడీ బిల్డర్ కాదు కాబట్టి..ఈ పనికి మీరు సమర్థులు కారని మేము భావిస్తున్నాం. అందుకే మీ దరఖాస్తును తిరస్కరిస్తున్నాం..ఇది శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పని..అయినా మీరు ఈ ఉద్యోగం చేయటానికి ఇష్టపడితే ఫలానా నంబరును సంప్రదించగలరు’ అంటూ ఓ నంబరు ఇచ్చింది.

ఆ కంపెనీ చెప్పిన సమాధానానికి చార్లెట్ కు ఒళ్లు మండిపోయింది. సరైన సమాధానం నేను కూడా ఇవ్వాల్సిందననుకుంది. అంతే ‘ముందుగా మీ కంపెనీకి ధన్యవాదాలు..నాకు వ్యవసాయ పనులలో మంచి అనుభవం ఉంది. 40 డిగ్రీల మండే ఎండలో కూడా నేను అలసిపోకుండా పనిచేయగలను. ఆస్ట్రేలియాలో వ్యవసాయ పనులు చేశాను. తాను ఈ ఈ మెయిల్ పంపేముందు కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకున్నాను. ఈ ఉద్యోగం నాకు సరైంది అని భావించి దరఖాస్తు చేసుకున్నాను. కానీ మీ సమాధానం చూసి నేను కూడా మీకు సమాధానం ఇవ్వాలని భావించాను. ఇది తన శ్రమకు తగిన ఉద్యోగం కాదని అనిపిస్తోంది.మీలాంటి చులకన భావం కలిగిన వ్యక్తుల దగ్గర పనిచేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. మీరు కోరుకున్నంత శక్తి తన దగ్గర లేదని..అందుకే తనకు ఇటువంటి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు‘ అని తెలుపుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

ఆ కంపెనీకి, చార్లెట్‌కు మధ్య జరిగిన సంభాషణను ఆమె సోదరుడు ట్విట్టర్‌లో షేర్ చేయటంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌కు ఇప్పటివరకూ 9 లక్షల లైక్‌లు వచ్చాయి. వేల మంది ఈ ట్వీట్ చూసి కామెంట్లు చేశారు. ఆమె సదరు కంపెనీకి ఇచ్చిన జవాబును అందరూ మెచ్చుకుంటున్నారు.