Baba Ramdev : మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారు.. బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

'మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు. సల్వార్ సూట్స్ లో కూడా బాగుంటారు. నా లాగా ఏం వేసుకోకున్నా బాగుంటారు. గతంలో మేం పదేళ్లు వచ్చే వరకు బట్టలే వేసుకోలేదు' అని బాబా రాందేవ్ అన్నారు.

Baba Ramdev : మహిళలు బట్టలు లేకున్నా బాగుంటారు.. బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Baba Ramdev : ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ వివాదంలో చిక్కుకున్నారు. మహిళల వస్త్రధారణపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర థానేలో యోగా శిబిరం ముగిశాక మహిళలకు చీరలు ధరించే సమయం దొరకలేదు.

దీనిపై రాందేవ్ స్పందిస్తూ.. ‘మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు. సల్వార్ సూట్స్ లో కూడా బాగుంటారు. నా లాగా ఏం వేసుకోకున్నా బాగుంటారు. గతంలో మేం పదేళ్లు వచ్చే వరకు బట్టలే వేసుకోలేదు’ అని బాబా రాందేవ్ అన్నారు. బాబా రాందేవ్ ఇంత పచ్చిగా మాట్లాడింది మహిళల సమావేశంలో. అదీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ సమక్షంలో కావడం గమనార్హం.

థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా బాబా రాందేవ్ మహిళల వస్త్రధారణను ఉద్దేశించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ యోగా శిబిరానికి మహిళలు యోగా డ్రెస్సుల్లో వచ్చారు. మహిళలకు యోగా శిక్షణా కార్యక్రమం ఏర్పాటైంది. ఇది ముగిసిన వెంటనే మహిళల సమావేశం ప్రారంభమైంది. దాంతో మహిళలకు చీరలు ధరించే సమయం లేకపోయింది. ఈ పరిస్థితిపై మాట్లాడిన బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మహిళల వస్త్రధారణ గురించి బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళలపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారని, కించపరిచేలా మాట్లాడారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అని మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఇలాంటి కామెంట్స్ తో సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని? అని ప్రశ్నిస్తున్నారు. బాబా రాందేవ్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయొద్దని హెచ్చరించారు. మరి బాబా రాందేవ్ నోరు జారారా? లేదా ఉద్దేశ్యపూర్వకంగానే అలా మాట్లాడారా? అన్నది ఆయనకే తెలియాలి.