NFHS-5 survey: దేశంలో ఇంటర్నెట్ వాడకంలో మహిళలే అధికం.. తెలంగాణలో అయితే..

నేటి ఆధునిక యుగంలో కొద్ది నిమిషాలు ఇంటర్నెట్ లేకుంటే అతలాకుతలం అయిపోతాం. పొద్దున నిద్రలేచింది మొదలు పడుకొనే వరకు ఇంటర్నెట్ లేని మనిషి జీవితాన్ని ఊహించలేమటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ప్రతీపని...

NFHS-5 survey: దేశంలో ఇంటర్నెట్ వాడకంలో మహిళలే అధికం.. తెలంగాణలో అయితే..

Internet

NFHS-5 survey: నేటి ఆధునిక యుగంలో కొద్ది నిమిషాలు ఇంటర్నెట్ లేకుంటే అతలాకుతలం అయిపోతాం. పొద్దున నిద్రలేచింది మొదలు పడుకొనే వరకు ఇంటర్నెట్ లేని మనిషి జీవితాన్ని ఊహించలేమటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ప్రతీపని ఇంటర్నెట్ కు అనుసంధానంగానే ఉంటుంది. చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకు, దినసరి కూలీ నుంచి సాప్ట్ వేర్ ఉద్యోగి వరకు.. ఇలా ప్రతీఒక్కరూ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో ఇంటర్నెట్ వినియోగంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 (2019-21) సర్వే నిర్వహించింది. ఈ సర్వే మాత్రం ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

NFHS : 70 % మహిళలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు: NFHS సర్వే

దేశంలో ఇంటర్నెట్ వాడకంలో సాధారణంగా మగవాళ్లే అధికంగా ఉంటారని భావిస్తుంటాం. ఎందుకంటే దేశంలో అధికశాతం మంది ఉద్యోగాలు చేసేది వారే కనుక. దీంతో వారికి ఇంటర్నెట్ వినియోగం అవసరం కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ తాజా సర్వేలో ఇంటర్నెట్ వాడకంలో మహిళలే అధికమట. దేశంలో ఉన్న పురుషుల్లో 51.2 శాతం మందికి ఇప్పటి వరకు ఇంటర్నెట్ వినియోగం తెలియదని, 48.8శాతం మందే వాడుతున్నట్లు సర్వే పేర్కొంది. 66.7శాతం మంది మహిళలకు ఇంటర్నెట్ పరిచయం ఉందని, 33.3శాతం మంది మహిళలు ఇంటర్నెట్ కు దూరంగా ఉన్నారని సర్వే వెల్లడించింది.

NFHS : 70 % మహిళలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు: NFHS సర్వే

అయితే తెలంగాణ రాష్ట్రంలోనూ ఇంటర్నెట్ వాడకంలో మహిళలదే అగ్రస్థానం. తెలంగాణలో ఏకంగా 73.5శాతం మంది మహిళలకు ఇంటర్నెట్ పరిచయం ఉండగా, పురుషుల్లో మాత్రం 50శాతం మందికే ఇంటర్నెట్ తెలుసట. అత్యధికంగా ఛండీగఢ్ లో 91.9శాతం మంది పురుషులు, 75.2శాతం మంది మహిళలు ఇప్పటి వరకు ఇంటర్నెట్ ను వినియోగించలేదు. ఇంటర్నెట్ వాడకంలో బీహార్ ముందు వరుసలో ఉంది. మరోవైపు టీవీ చూడటంలో మహిళల కన్నా పురుషులే ఎక్కువని NFHS-5 survey తేల్చింది. కనీసం వారానికి ఒకసారి టీవీ చూసేవారు సగటు దేశవ్యాప్తంగా మహిళల్లో 53.5 శాతంగా ఉండగా, పురుషుల్లో 55.9 శాతంగా ఉందని సర్వే తెలిపింది.