Mizoram : సబ్బు కేసుల్లో రూ.1.53 కోట్ల డ్రగ్స్.. ఇద్దరు మహిళలు అరెస్ట్

ఇద్దరు మహిళా పెడ్లర్లు.. చాలా తెలివిగా కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను సబ్బు కేసుల్లో దాచిపెట్టారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

Mizoram : సబ్బు కేసుల్లో రూ.1.53 కోట్ల డ్రగ్స్.. ఇద్దరు మహిళలు అరెస్ట్

Mizoram

Women peddlers arrested in Mizoram : కోట్ల విలువ చేసే డ్రగ్స్ సబ్బు కేసుల్లో దాచేశారు. కానీ పోలీసులకు చిక్కిపోయారు మిజోరాంకి చెందిన ఇద్దరు మహిళలు. పోలీసులు వారి నుంచి కోట్లు విలువ చేసే 306 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

German Shepherd Dog discovers Cocaine : 70 టన్నుల అరటిపండ్ల బాక్స్‌‌లలో.. 2700 కిలోల కొకైన్..పసిగట్టేసిన డాగ్.. డ్రగ్స్ విలువ కోట్లలో..

ఐజ్వాల్‌లోని వెంగ్త్‌లాంగ్ ప్రాంతంలో 28, 26 సంవత్సరాల వయసున్న మహిళా పెడ్లర్ల నుంచి రూ.1.53 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ 306 గ్రాములు ఉంటుందని అస్సాం రైఫిల్స్ తెలిపింది. తమకు అందిన సమాచారం మేరకు అస్సాం రైఫిల్స్, ఐజ్వాల్‌లోని స్పెషల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ల సంయుక్త బృందం ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఇద్దరు మహిళా పెడ్లర్లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Brazil Drug Market : కూరగాయలు అమ్మినట్లు డ్రగ్స్ అమ్మేస్తున్నారు.. ఎక్కడంటే?

మొత్తం హెరాయిన్‌ను 22 సబ్బు కేసుల్లో దాచి పెట్టినట్లు పోలీసులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న హెరాయితో పాటు ఇద్దరు నిందితులను స్పెషల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ CID (క్రైమ్) కి అప్పగించినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.