Salvamari : పొలంలో కూలి.. చదువుల సరస్వతిగా

సీఎస్సీ పరీక్షా ఫలితాల్లో సివిల్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్నికైనా దానిపై అంతగా ఆసక్తి చూపకుండా బిఇడి పూర్తిచేసి ఇడుక్కి జిల్లాలోని వంచియాల్ ప్రభుత్వ హైస్కూల్ టీచర్ గా తన ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించింది.

Salvamari : పొలంలో కూలి.. చదువుల సరస్వతిగా

Selvamari

Salvamari : కష్టపడితే జీవితంలో తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్న విషయం కేరళకు చెందిన 28ఏళ్ళ సెల్వమరి నిరూపించింది. చిన్న వయస్సులోనే కన్న తండ్రిని కోల్పోయి ఇంటికి పెద్ద దిక్కుగా మారింది. ఎన్నో కష్టాలు, సవాళ్ళు ఎదురైనా పట్టుదలతో వాటిని సునాయాశంగా అదిగమించింది. లక్ష్యసాధనవైపు దూసుకుపోతూ అందరి ప్రశంసలందుకుంటున్న కేరళ యువతి సెల్వమరి విజయగాధకు సంబంధించిన  వివరాల్లోకి వెళితే…

కేరళలోని చొట్టుపారాకి చెందిన సెల్వమరి కి చిన్న వయస్సులోని తండ్రి చనిపోయాడు. దీంతో కుటుంబం దిక్కుతోచని స్ధితిలోపడింది. తల్లికి అండగా ఉంటూ కుటుంబ ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపర్చుకునేందుకు తల్లితోపాటు నిత్యం కూలిపనులకు వెళ్ళేది. ఒకవైపు కూలిపనులు చేస్తూనే మరోవైపు చదువుపై దృష్టిపెట్టింది. పట్టుదలతో పరిస్ధితులను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ధైర్యంగా డిగ్రీని పూర్తి చేసింది.
మళయాళం , ఇంగ్లీషులపై పట్టులేకపోవటంతో తోటి విద్యార్ధుల అవహేళన ఒకానొక దశలో చదువు మానేయాలన్న నిర్ణయానికి వచ్చినప్పటికీ ఎలాగైనా వాటిని నేర్చుకోవాలన్న పట్టుదల కసిని పెంచింది. తల్లి పడుతున్న కష్టాన్ని కళ్ళముందుకు తెచ్చుకుని మంచి ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో వాటిని నేర్చుకుంది.

సీఎస్సీ పరీక్షా ఫలితాల్లో సివిల్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్నికైనా దానిపై అంతగా ఆసక్తి చూపకుండా బిఇడి పూర్తిచేసి ఇడుక్కి జిల్లాలోని వంచియాల్ ప్రభుత్వ హైస్కూల్ టీచర్ గా తన ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించింది. అంతటితో ఆగకుండా ఎంఈడీ, ఎం.ఫిల్ కోర్సులను పూర్తిచేసి యూజీసీ నెట్ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం మ్యాథ్య్ లో పీహెచ్ డి చేస్తుంది. ఐఏఎస్ అధికారిణిగా ప్రజలకు సేవచేయాలన్న లక్ష్యంతో సివిల్ సర్వీసుకు సిద్ధమౌతుంది. ఆమె విజయగాధ తెలిసిన ప్రముఖులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అభినందనలు తెలపటంతోపాటు, స్వయంగా రాజభవన్ కు సెల్వమరిని ఆహ్వానించారు. ప్రస్తుతం సెల్వమరి కేరళ యువతకు స్పూర్తిగా మారారు.