T20WorldCup: విశ్వ విజేత ఇంగ్లండ్.. ఫైనల్‌లో పాకిస్తాన్‌పై విజయం.. రెండోసారి కప్పు నెగ్గిన ఇంగ్లండ్

విశ్వ విజేతగా నిలిచింది ఇంగ్లండ్. టీ20 వరల్డ్ కప్-2022 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇది రెండోసారి

T20WorldCup: విశ్వ విజేత ఇంగ్లండ్.. ఫైనల్‌లో పాకిస్తాన్‌పై విజయం.. రెండోసారి కప్పు నెగ్గిన ఇంగ్లండ్

T20WorldCup: ‘టీ20 వరల్డ్ కప్-2022’ విజేతగా నిలిచింది ఇంగ్లండ్. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

Pawan Kalyan: ఓట్లు రాకపోయినా నామినేషన్లు వేస్తాం.. యువత చెడిపోతుందనే ఒక్క యాడ్ కూడా చేయలేదు: పవన్ కల్యాణ్

తర్వాత 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజేతగా నిలిచింది. పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెన్ స్టోక్స్ అర్ధ సెంచరీ సాధించి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్ 29 పరుగుల వద్ద తొలి వికెట్ (రిజ్వాన్) కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లో కోల్పోతూ వచ్చింది. పాక్ బ్యాటింగ్‌లో అత్యధికంగా షాన్ మసూద్ 38 పరుగులు చేయగా, ఆ తర్వాత బాబార్ ఆజం 32 పరుగులు, షాదాబ్ ఖాన్ 20 పరుగులు, రిజ్వాన్ 15 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో పాక్ 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

Pawan Kalyan: జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారు.. కాలనీలకు కనీసం రోడ్లు కూడా వేయలేదు: పవన్ కల్యాణ్

పాక్ బ్యాట్స్‌మెన్‌ను ఇంగ్లండ్ బౌలర్లు తక్కువ స్కోర్లకే కట్టడి చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఏడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అలెక్స్ హేల్స్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. తర్వాత ఫిలిప్ సాల్ట్ 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. బట్లర్ 26, హ్యారీ బ్రూక్ 20, మొయిన్ అలీ 19 పరుగులే చేసి ఔటయ్యారు. అయితే, బెన్ స్టోక్స్ నిలకడగా ఆడుతూ 49 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓవర్ మిగిలి ఉండగానే, 5 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ లక్ష్యాన్ని సాధించింది. దీంతో ఇంగ్లండ్ ‘టీ 20 వరల్డ్ కప్-2022’ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ ఈ కప్ గెలవడం ఇది రెండోసారి. గతంలో 2010లో మొదటిసారి ఇంగ్లండ్ ‘టీ 20 వరల్డ్ కప్’ నెగ్గింది.