ప్రపంచంలోనే కాస్ట్లీ : ప్లేటు బిర్యానీ రూ.20 వేలు..!!

ప్రపంచంలోనే కాస్ట్లీ : ప్లేటు బిర్యానీ  రూ.20 వేలు..!!

most expensive biryani plate Rs.20,000 : బిర్యానీ అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ లో బిర్యానీ రూ.50ల నుంచి రూ.1000ల వరకూ ఉంటుంది. కానీ ఏకంగా ప్లేటు బిర్యానీ రూ.20వేలు అంటే నమ్ముతారా? నమ్మే తీరాలి..మీరు విన్నది నిజమే..ఓ ప్రత్యేక బిర్యానీ ప్లేటు రూ.20,000..! అబ్బా..ఇంత కాస్ట్లీ బిర్యానీ అంటున్నారు అదేమన్నా బంగారంతో చేస్తారా? అనే డౌట్ కూడా రావచ్చు..మీ డౌట్ కూడా నిజమే..దాని పేరే ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’. బంగారం రేకులతో సర్వ్ చేస్తారీ బిర్యానీని…!! బిర్యానీ ప్లేటు మొత్తాన్ని 23 కేరెట్ల బంగారం రేకులతో డెకరేట్ చేస్తారంటే మరి ఆ మాత్రం కాస్ట్లీ ఉండదా ఏంటీ..!! ఇక ఈ కాస్ట్లీ బిర్యానీ టేస్ట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందంటున్నారు బిర్యానీ ప్రియులు..మరి ఈ బిర్యానీ తినాలంటే దుబాయ్ వెళ్లాల్సిందే..

 

దుబాయ్‌లోని ఓ బ్రిటిష్ కాలం నాటి బంగ్లా ‘బాంబే బరో’ పేరుతో లగ్జరీ హోటల్‌గా మారిపోయింది. ఇటీవలే ప్రారంభమైన ఈ హోటల్‌లో బిర్యానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ప్లేటు బిర్యానీ రూ.20 వేలు. ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ పేరుతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిర్యానీగా పేరొందిందీ బిర్యానీ. దుబాయ్ కరెన్సీలో ఇది 1,000 దిర్హమ్‌లు. అదే భారత కరెన్సీలో రూ. 19,704. అంటే దాదాపు రూ.20వేలు..!!

హోటల్ తొలి వార్షికోత్సవం సందర్భంగా హోటల్ మెనూలో దీనిని చేర్చారు. మూడు కేజీల ఈ బిర్యానీని పెద్ద గోల్డ్ మెటాలిక్ ప్లేట్‌లో సర్వ్ చేస్తారు. ఇందులో చికెన్ బిర్యానీ రైస్, కీమా రైస్, వైట్, శాఫ్రాన్ రైస్‌ వేరియంట్లు లభిస్తాయి. బేబీ ఆలుగడ్డలు, ఉడకించిన గుడ్లతో ప్లేట్ కలర్ ఫుల్ గా డెకరేట్ చేసి సర్వ్ చేస్తే ఇక లాగించేయటమే లేట్..

అంతేకాదు ఈ బిర్యానీలో కశ్మీరీ ల్యాంబ్ సీక్ కెబాబ్స్, పాత ఢిల్లీ ల్యాంబ్ చాప్స్, రాజ్‌పుట్ చికెన్ కెబాబ్స్, ముఘలాయ్ కోఫ్తాలు, మలాయ్ చికెన్ వంటివాటిని బిర్యానీపై అందంగా డెకరేట్ చేస్తారు. ఇంత వరకూ ఓకే..ఇక్కడే ఉంది ఈ బిర్యానీ అసలు విషయం. ఇంత ఖరీదు ఉండటానికి కూడా అదే ప్రత్యేకత. ‘‘బిర్యానీ ప్లేటు మొత్తాన్ని 23 కేరెట్ల బంగారం రేకులతో డెకరేట్ చేస్తారు.

దీంతో ఆ బిర్యానీకి ఎక్కడలేని లుక్ వచ్చేస్తుంది. రాయల్ లుక్‌తో నోరూరుస్తుంది. ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టేసుకుందామా? అని తెగ ఆరాటపడిపోయేలా ఉంటుంది బర్యానీ ప్లేట్ లుక్. రాయల్ లుక్ తో అద్దిరిపోయేలా ఉంటుంది. దీంతో పాటు మూడు సైడ్ డిష్‌లను కూడా సర్వ్ చేస్తారు. ఇందులో నిహారీ సాలన్, జోధ్‌పురి సాలన్, బాదామి సాస్‌లను బాదం, దానిమ్మ రైతాతో అందిస్తారు.

మనం ఈ బిర్యానీ తినానికి గబగబా వెళి..ఆర్డర్ చేస్తే..వెంటనే మన ముందు ప్రత్యక్షం కాదండీ బాబూ..మనం ఆర్డర్ ఇచ్చిన తరువాత దాన్ని సర్వ్ చేసేందుకు 45 నిమిషాలుపైనే పడుతుంది. గోల్ట్ కలర్ ఆప్రాన్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు అతిపెద్ద బిర్యానీ ప్లేట్‌ను అపురూపంగా తీసుకొచ్చి కష్టమర్ ముందు అతి మర్యాదగా పెడతారు.

ప్లేటు బిర్యానీ అంటే ఒక్కరే కాదు నలుగురి నుంచి ఆరుగురు చక్కగా కడుపు నిండా తినొచ్చు. కాబట్టీ..ఫ్యామిలీ మొత్తంగా వెళ్లి హాయిగా తినొచ్చు. అలా ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి బాతాకానీ కొడుతూ తినొచ్చు. ఏంటీ ఈ బిర్యానీ గురించి చెబుతుంటునే నోరూరిపోతుంది కదూ..ఎప్పుడెప్పుడు తిందామానీ..నోరూరిపోతోంది కదా.. మీరు దుబాయ్‌లోనే ఉన్నా..లేక వెళ్లినా..ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్‌లో ఉన్న ఈ ‘బాంబే బరో’కు వెళ్లి ఈ రాయల్ లుక్ బిర్యానీని ఒక్కసారి టేస్ట్ చేసి రండీ..ఆ టేస్ట్ సంగతేంటో తేల్చుకుని వచ్చేయండీ..హా ఏంటీ మరీ..వెళతారు కదూ..