happy sleeping day : నిదురపో కమ్మగా..

దేశంలో నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నారని అంచనా. కంటినిండా..నిద్ర ఉంటే..ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

happy sleeping day : నిదురపో కమ్మగా..

World Sleep

World Sleep Day 2021 : నిద్ర..మనిషికి..ఎంతో అవసరం. ప్రస్తుతం ఉరుకులు..పరుగుల మధ్య కనీసం కొద్దిసేపైనా నిద్ర పోయే వారు చాలా తక్కువగా ఉంటున్నారు. ఒకప్పుడు రాత్రి 8 గంటలకు పడుకొని..ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య లేచేవాళ్లు. ఇప్పుడు అంతా ఉల్టా..పుల్టా… ఉదయం 4, 5 గంటలకు పడుకొంటున్నారు. రాత్రి పూట ఎక్కువ సేపు మెలుకవతో ఉండిపోతున్నారు. మొబైల్, టీవీ చూడడం, వర్క్ చేయడమో..లాంటి ఇతరత్రా పనులు చేస్తున్నారు.

దీంతో శరీర జీవ గడియారం దెబ్బతింటోంది. దేశంలో నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నారని అంచనా. కంటినిండా..నిద్ర ఉంటే..ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ happy sleeping day జరుపుకుంటుంటారు.

నిద్ర లేని వారిలో సమస్యలు : –
రోజులో 24 గంటలు. అందులో సుమారు 7 నుంచి 8 గంటల పాటు నిద్రకు కేటాయించాలని అంటుంటారు. 8 గంటల నిద్ర సరిగ్గా లేకపోతే…16 గంటల మెలుకవ సమయం అంతా డిస్ట్రబ్ అవుతుంది. రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కానీ..చాలా మందికి కరెక్టు టైంకు నిద్ర రాదు. మారుతున్న జీవన విధానాలు, అలవాట్లు ప్రభావం చూపెడుతున్నాయి.

రాత్రి వేళ వర్క్ చేయడం..పొద్దునే పడుకోవడం చేస్తున్నారు. నిద్ర సరిగ్గా లేకపోతే..మనిషి మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. రక్తప్రసరణ విషయంలో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. దీని ఫలితంగా..గుండెపోటు కలిగే అవకాశాలున్నాయంటున్నారు. అంతేగాకుండా..సరిగ్గా నిద్రపోని వారు బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయని వెల్లడిస్తున్నారు. నిద్ర లేకపోవడంతో ఒత్తిడి ఎక్కువ కావడం, నిరాశలో మునిగిపోతుంటారని తెలిపారు.

మంచి నిద్ర వల్లే కలిగే లాభాలు :-
మంచి నిద్ర వల్ల..నిరాశ, ఒత్తిడి నుంచి దూరం చేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. గుండెకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పనిపై దృష్టి పెట్టడానికి దోహద పడుతుంది. అంతేగాకుండా జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలో నిద్ర పాత్ర ఉంది. సరైన నిద్ర అనేది మనసుపై, మెదడుపై కలిగే ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. ఆరోగ్యానికి సహకరింస్తుంది. దీంతో రోజంతా ఉత్సహంగా ఉంటారు.

నిద్ర కోసం షెడ్యూల్ : –

మంచి నిద్ర కోసం ఒక షెడ్యూల్ ను రూపొందించుకోండి. ఫలానా టైంలో నిద్ర పోవాలని నిర్ణయం తీసుకోండి. నిద్ర పోయే ముందు టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. బెడ్ రూం సరైన టెంపరేచర్ లో ఉండే విధంగా చూసుకోవాలి. నిశ్శబ్దంగా..మనస్సు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. కెఫిన్, అల్కాహల్, ఇతరత్రా వ్యసనాలకు దూరంగా ఉండాలి. నిద్ర సమస్యలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచింది.