ఖననాల మట్టి : శవాలతో సేంద్రీయ ఎరువు తయారీ..ఆత్మీయులకు శవాలను కంపోస్ట్ మట్టి..మొక్కలు పెంచొచ్చు..

ఖననాల మట్టి : శవాలతో సేంద్రీయ ఎరువు తయారీ..ఆత్మీయులకు శవాలను కంపోస్ట్ మట్టి..మొక్కలు పెంచొచ్చు..

turns corpses into compost : వర్మీ కంపోస్ట్ ఎరువు గురించి తెలుసు. శవాల కంపోస్టు గురించి తెలుసా? కనీసం ఎప్పుడైనా విన్నారా?! బహుశా విని ఉండం. కానీ ఈ ఆధునిక కాలంలో ఏదైనా సాధ్యమే. చెత్త, గడ్డి, ఆకులను కుళ్లబెట్టి ద్వారా కంపోస్ట్ ఎరువు తయారు చేస్తారనే విషయం తెలిసిందే. కానీ ఈ శవాలతో ఎరువులు తయారు చేయటం ఏంటీ మరీ దారుణంగా అనుకోవచ్చు.. కానీ నిజమే. మనుషుల శవాలతోనూ సేంద్రీయ ఎరువు తయారు చేసే పద్ధతులు వచ్చేశాయి. దీని వల్ల తరువాత చనిపోయేవారికి స్థలం దొరుకుతుంది. మృతదేహాలను ఎరువుగా మార్చి కావాలంటే ఆ ఎరువుగా మారిన మట్టిని సంబంధిత ఆత్మీయులకు కూడా ఇవ్వవచ్చు. ఇది వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా అది సాధ్యమేనట. పైగా కాలుష్యాన్ని తగ్గించటానికి ఇదొక మార్గమనే అభిప్రాయాలు వస్తున్నాయి.

మరణానంతరం కూడా ఈ ప్రకృతికి మనం ఉపయోగపడుతాం అన్నమాట ఈ ప్రక్రియ ద్వారా ఉపయోగపడుతుంది. “మన శరీరాలను మట్టిలో ఎలా కలిపేసుకోవాలో ప్రకృతికి బాగా తెలుసు. బ్యాక్టీరియా క్రియాశీలంగా ఉంటే.. ఓ నెల రోజుల్లోనే మనిషి శరీరం పూర్తిగా కుళ్లిపోతుంది. కానీ.. అలా జరగడంలేదు. ఎందుకంటే.. పలువురు శవాలను దహనం చేస్తున్నారు. (వారి వారి సంప్రదాయాలను బట్టి) మరికొందరు గాజుపెట్టెల్లో.. చెక్క డబ్బాల్లో పెట్టి ఖననం చేస్తున్నారు. అలా చేయడం వల్ల బ్యాక్టీరియా ఆ బాక్సుల్లోకి వెళ్లక, శవం మట్టిలో కలిసిపోవడంలేదు..అలా ఆ బాక్సులు శిథిలమైన శరీరం మట్టిలో కలవటానికి చాలా కాలం పడుతుంది.

శవాలను కంపోస్టుగా మార్చి మొక్కలకు ఎరువుగా వినియోగించడాన్ని చట్టబద్ధం చేసేందుకు అమెరికాలోని వాషింగ్టన్‌లో అమలులోకి రానుంది. మానవ అవశేషాలను కంపోస్ట్‌గా మార్చడానికి ప్రపంచంలోనే అతిపెద్దదైన కొత్త సదుపాయం కొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. దీని కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని రిటర్న్ హోమ్ ఏప్రిల్‌లో సీటెల్‌లో ప్రారంభించాలని యోచిస్తోంది. ఆత్మీయులను కోల్పోయిన దు:ఖిస్తున్న కుటుంబాలకు వారి దివంగత వ్యక్తులకు ఈ మట్టిని ఇస్తారు. ఇలా నెలకు 10 శరీరాలను (శవాలను) ప్రాసెస్ చేయగలదు. అంటే ఎరువుగా తయారు చేయగలదు.

సీఈఓ మీకా ట్రూమాన్ వాషింగ్టన్‌లోని కంపోస్ట్ బాడీలకు చట్టబద్ధంగా మారిందని తెలుసుకున్న తరువాత 2019 లో బ్యాంకింగ్ నుండి అంత్యక్రియల పరిశ్రమకు మారారు. అతను అల్ఫాల్ఫా, సాడస్ట్, ఉడ్ చిప్స్ వంటి ఏజెంట్లతో పాటు మానవ అవశేషాలను కంటైనర్‌లో ప్యాక్ చేస్తుంది. అవి కుళ్ళిపోవడాన్ని వేగవంతం చేయడానికి నీరు, వేడి, గాలి చొప్పించి మృతదేహం త్వరగా ఎరువులాగా అంటే మట్టిలాగా అయ్యేలా చేస్తారు.

అలా 30 రోజుల తరువాత మృతదేహం కణజాలం కుళ్ళిపోతుంది. ఎముకలు, దంతాలు నేలమీద మిశ్రమానికి జోడించబడతాయి. అలా ఎరువులా తయారైన మట్టి ఏమాత్రం వాసన రాదు. మెటల్ స్క్రూలు లేదా సిలికాన్ ఇంప్లాంట్లు వంటి కృత్రిమ పదార్థాలను పరీక్షించడానికి ప్రత్యేక జల్లెడ యంత్రాన్ని ఉపయోగిస్తారు. అలా తయారైన కంపోస్ట్‌ను మతుల కుటుంబ సభ్యులకు తిరిగి ఇచ్చే ముందు మరో 30 రోజులు దాన్ని అలా ఉంచుతారు.


సహజ సేంద్రీయ రిడక్షన్ లేదా టెర్రమేషన్ అని పిలువబడే ఈ ప్రక్రియ మానవ అవశేషాలను పారవేసేందుకు పర్యావరణ అనుకూలమైన మార్గం. రాబోయే సంవత్సరాల్లో ఇదే జరుగనుంది. దానికి కోసం మీకా ట్రూమాన్ పంది కళేబరాలను ఇప్పటికే పరీక్షించి అనుకున్న ఫలితాలను రాబట్టాడు.


అలా ఆ సేంద్రీయ మట్టిన తీసుకున్న మృతుల కుటుంబీకులు వారికి దాన్ని ఇష్టమైన రీతిగా వాడుకోవచ్చు. ఆ కంపోస్టుపై మొక్కలు పెంచుకోవచ్చు. లేదా పాత్రలో వేసుకుని తమ ఆత్మీయులు తమతోనే ఉన్నారనే తృప్తిని భావించవచ్చని తెలిపారు. ఇలా మతదేహాలను సేంద్రీయ ఎరువుగా తయారు చేయటానికి..ఈ ప్రక్రియ కోసం.. ఒక్కో మృతదేహానికి 94,950 డాలర్లు వసూలు చేయబడతాయని తెలిపారు. వాషింగ్టన్ లో ఖననం ప్లాట్ల $ 5,500 ధర కంటే ఇది చౌకైనది కూడా.

మతదేహాలను మట్టిగా మార్చి ఇచ్చే ప్రక్రియ గురించి మీకా మాట్లాడుతూ..’ఇటువంటి ప్రక్రియ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నేను ప్రపంచాన్ని మార్చబోతున్నానని అనుకున్నాననీ తెలిపాడు. అలా మృతదేహాల మట్టిని తీసుకున్నవారి భావన కూడా చాలా గొప్పగా ఉంటుందని భావించాలనని అన్నాడు.


‘మేము మా ప్రియమైన వ్యక్తి పక్కన నిలబడతాము..మా ఆత్మీయులపై చక్కటి పచ్చటి మొక్కలు పెంచుతాము. కాబట్టి మా ఆత్మీయులకు మేం కోల్పోలేదు.తిరిగి వారిని ‘సేంద్రీయ ఎరువుగా’పొందుతాము. అందుకే వారు చనిపోయారని అనుకుని కుమిలిపోకుండా..వారికి వీడ్కోలు పలుకుతాము..మనం ఎంచుకునే సేంద్రీయ పదార్థాలలో వారిని పొందుతామనే ఫీలింగ్ వారి వారి బంధువులకు అనిపిస్తుందని తెలిపాడు. మీ ఆత్మీయులపై చక్కటి అందమైన పువ్వులను పూయించండి అంటున్నాడు మీకా..

 

కాలిఫోర్నియా, ఒరెగాన్,కొలరాడోలు కూడా రాబోయే రోజుల్లో టెర్రమేషన్‌ను చట్టబద్ధం చేయడంలో వాషింగ్టన్‌ను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాయి..