Viral Video: గాయపడ్డ బిడ్డను ఆస్పత్రికి తీసుకొచ్చిన కోతి.. చికిత్స చేసిన వైద్యుడు.. వైరల్‌గా మారిన వీడియో

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవటం సర్వసాధారణం. కొందరు తమ పెంపుడు జంతువులకు గాయాలైనప్పుడు ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్సచేయిస్తుంటారు.. ఇదీ సర్వసాధారణమే.. కానీ బీహార్ రాష్ట్రంలో విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ తల్లికోతి తన బిడ్డతో కలిసి ఆస్పత్రికి వచ్చింది.

Viral Video: గాయపడ్డ బిడ్డను ఆస్పత్రికి తీసుకొచ్చిన కోతి.. చికిత్స చేసిన వైద్యుడు.. వైరల్‌గా మారిన వీడియో

Monkey

Viral Video: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవటం సర్వసాధారణం. కొందరు తమ పెంపుడు జంతువులకు గాయాలైనప్పుడు ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్సచేయిస్తుంటారు.. ఇదీ సర్వసాధారణమే.. కానీ బీహార్ రాష్ట్రంలో విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ తల్లికోతి తన బిడ్డతో కలిసి ఆస్పత్రికి వచ్చింది. అప్పటికి వైద్యుడు రాకపోతే వేచి ఉండి వైద్యుడు వచ్చాక లోపలికి వెళ్లింది. కోతి తీరుతో ఆశ్చర్యపోయిన వైద్యుడు చికిత్స కోసం వచ్చినట్లు గమనించాడు. దీంతో గాయపడ్డ పిల్లకోతి, తల్లికోతికి చికిత్స అందించాడు. అయితే చికిత్స అందిస్తున్నంత సేపు తల్లికోతి పిల్ల కోతిని తన చాతికి హత్తుకొని ఉంది. ఈ అరుదైన సన్నివేశాన్నిచూసేందుకు స్థానిక ప్రజలు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి వచ్చారు. అయినా కోతిలో ఎలాంటి బెరుకు కనిపించలేదు.

ఆడకోతి తన బిడ్డను ఛాతికి హత్తుకొని ఉండగా.. డాక్టర్ ఛాంబర్ వద్ద స్టూల్‌పై కూర్చున్నట్లు కనిపిస్తుంది. వైద్యుడు దాని గాయాలను పరిశీలించి, కొన్ని లేపనాలను పూయడానికి ముందు దానిని శుభ్రం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో కోతి ఎంతో ఓపికగా తనబిడ్డను పట్టుకొని కనిపించింది. సాధారణంగా జంతువులు ఏవైనా చికిత్స అందించే సమయంలో తొందరగా సహకరించవు. వెలుతురుతో ఆశ్చర్యానికి, చికాకుకు గురవుతుంటాయి. కానీ కోతి మాత్రం తనకు, తన బిడ్డకు వైద్యం చేయించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై డాక్టర్ SM అహ్మద్ మాట్లాడుతూ.. తాను క్లినిక్ వచ్చేకంటే ముందే కోతి తన బిడ్డను తీసుకొని అక్కడికి వచ్చింది. నేను మామూలుగా కోతులు వస్తాయని అనుకున్నా. కానీ నేను డోర్ తీసి లోపలికి వచ్చి నా చాంబర్ లో కూర్చోగానే తన బిడ్డను తీసుకొని కోతి నావద్దకు వచ్చింది.

Hindus in Pakistan: పాకిస్థాన్‌లో ఎన్ని లక్షల మంది హిందువులు నివసిస్తున్నారో తేల్చిన ఎన్ఏడీఆర్ఏ నివేదిక

తొలుత కొంత ఆందోళన చెందినప్పటికీ కోతి ప్రవర్తన చూసి తనకు అర్థమైంది. తల్లికోతికి, పిల్ల కోతికి రెండింటికి గాయాలయ్యాయి. ఇవి రెండు ఎక్కడినుంచో కిందపడటం వల్ల గాయాల పాలయ్యాయి. వెంటనే గాయాలైన స్థానంలో వైద్యం అందించా. వైద్యం అందించేంత సేపు రెండు కోతులు ప్రశాంతంగా కనిపించినట్లు వైద్యుడు తెలిపాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. కోతి తీరును చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.