WFI Chief Brij Bhushan : రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై పోక్సో కేసులో కొత్త ట్విస్ట్

భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై పోక్సో కేసులో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగు చూసింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ రెజ్లర్ ఈవెంట్ సమయంలో తాను మైనర్ కాదని తాజాగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వడం సంచలనం రేపింది....

WFI Chief Brij Bhushan : రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై పోక్సో కేసులో కొత్త ట్విస్ట్

Brij Bhushan

WFI Chief Brij Bhushan – POSCO Act : భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై పోక్సో కేసులో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగు చూసింది.(New Twist In Case) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ రెజ్లర్ ఈవెంట్ సమయంలో తాను మైనర్ కాదని తాజాగా కోర్టులో వాంగ్మూలం ఇవ్వడం సంచలనం రేపింది.లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాలిక గతంలో తాను మైనర్ అని చెప్పడంతో ఢిల్లీ పోలీసులు పోక్సో చట్టం (POSCO Act) కింద కేసు నమోదు చేశారు.కాని కోర్టుకు హాజరైన సదరు బాలిక తాను మైనర్‌ను కాదని చెప్పడంతో బ్రిజ్ భూషణ్‌పై (WFI Brij Chief Bhushan) ఉన్న కేసులో పోక్సో సెక్షన్‌ను ఢిల్లీ పోలీసులు తొలగించనున్నారు.

Biparjoy Very Severe Cyclone: పలు రాష్ట్రాల్లో ఈ నెల 12వతేదీ వరకు భారీవర్షాలు

పోక్సో కేసులో నిందితుడైన బ్రిజ్ భూషణ్ పై(Case Against Federation Chief) పోక్సో చట్టం కింద కేసు నమోదై దోషిగా తేలితే గరిష్ఠంగా ఏడేళ్లు జైలు శిక్ష పడుతుంది. కాని మహిళపై అత్యాచారం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. బుధవారం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తో చర్చల అనంతరం రెజ్లర్లు తమ ఆందోళనకు కొంత విరామం ప్రకటించారు. తన కుమార్తె మైనర్ కాదని చెప్పిందే కానీ,లైంగిక వేధింపులపై ఆమె చేసిన ఫిర్యాదు అలాగే ఉందని బాధిత బాలిక తండ్రి చెప్పారు. రెజ్లర్లు ఆందోళన ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత ఏప్రిల్ 29వతేదీన ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఏడుగురు రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

Woman live in relationship:థానేలో దారుణం.. ప్రియుడితో సహజీవనం చేస్తున్న మహిళను చంపి..ముక్కలుగా కోసి…

తాజాగా ఇచ్చిన వాంగ్మూలంతో పోక్సో కేసు ఎత్తివేస్తే, అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఒక కేసు ఉంటుంది.జూన్ 15వతేదీలోగా ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం ప్రభుత్వం రెజ్లర్లకు ఇచ్చిన ప్రతిపాదనలో ఇది భాగమే.అయితే ఓ రెజ్లర్ పోక్సో కేసును ఉపసంహరించుకుందని ప్రచారం జరిగింది. దీంతో తన కుమార్తె మైనర్ కాదని చెప్పిందే కాని ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు వచ్చిన కథనాలు పూర్తిగా నిరాధారమైనవని బాలిక తండ్రి తెలిపారు.మొత్తంమీద బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.