XE variant : దేశంలో ఎక్స్ఈ వేరియంట్ కలకలం.. గుజరాత్‌లో తొలికేసు నమోదు..

దేశంలో కొవిడ్ తీవ్రత తగ్గుతున్న క్రమంలో కొత్తగా ఎక్స్ఈ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో మహిళలకు ఎక్స్ఈ వేరియంట్ సోకినట్లు వార్తలు వచ్చాయి.

XE variant : దేశంలో ఎక్స్ఈ వేరియంట్ కలకలం.. గుజరాత్‌లో తొలికేసు నమోదు..

Xl Variant

XE variant : దేశంలో కొవిడ్ తీవ్రత తగ్గుతున్న క్రమంలో కొత్తగా ఎక్స్ఈ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో మహిళలకు ఎక్స్ఈ వేరియంట్ సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం వీటిని నిర్ధారించలేదు. తాజాగా గుజరాత్ లో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ సోకినట్లు అధికారులు వర్గాలు వెల్లడించాయి. ఎక్స్ఈ వేరియంట్ సోకినట్లు భావిస్తున్నప్పటికీ పూర్తిగా నిర్ధారణ కాలేదని, సదరు వ్యక్తి నమూనాలను ఎన్ సీడీసీ (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌)కు పంపినట్లు అధికార వర్గాలు తెలిపారు.

covid cases : కట్టడిలోనే కరోనా.. దేశంలో కొత్తగా 1,150 కేసులు

గుజరాత్ లో గతనెల 13న కరోనా బారిన పడ్డ సదరు పేషెంట్ వారం తర్వాత కోలుకున్నాడు. అయితే శాంపిల్ జీనోమ్ సీక్వెన్సింగ్ లో సదరు పేషెంట్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ బారినపడినట్లు తెలుస్తోంది. అయితే సదరు వ్యక్తి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే గత రెండు రోజుల క్రితం మంబాయిలో మహిళలకు ఎక్స్ఈ వేరియంట్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.

Genome Sequencing Labs : ఏపీలో త్వరలో జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌ ల్యాబ్‌

దక్షిణాఫ్రికా నుంచి ముంబాయి నగరానికి వచ్చిన 50ఏళ్ల మహిళలో బీఏ1, బీఏ2 అనే రెండు ఒమిక్రాన్ వేరియంట్లు కనుగొన్నట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుండి ప్రకటన వెలువడింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం దానిని నిర్ధారించలేదు. ప్రస్తుతమున్న ఆధారాలను బట్టి అది కచ్చితంగా ఎక్స్ఈ వేరియంటేనని చెప్పలేమని తెలిపింది.