Y Movie Trailer : పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి సంపాదించడానికి ప్రతివాడు పూరి జగన్నాథ్ కాదుగా!..

వెరైటీ కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్, లేటెస్ట్ సూపర్ హిట్ సినిమాలతో రోజురోజుకీ ఆడియెన్స్ తో ‘ఆహా’ అనిపిస్తూ డిజిటల్ రంగంలో దూసుకెళ్తోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’..

Y Movie Trailer : పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి సంపాదించడానికి ప్రతివాడు పూరి జగన్నాథ్ కాదుగా!..

Y Movie Trailer

Y Movie Trailer : వెరైటీ కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్, లేటెస్ట్ సూపర్ హిట్ సినిమాలతో రోజురోజుకీ ఆడియెన్స్ తో ‘ఆహా’ అనిపిస్తూ డిజిటల్ రంగంలో దూసుకెళ్తోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’.. ఇటీవల ‘క్రాక్’, ‘నాంది’, ‘జాంబిరెడ్డి’ వంటి సినిమాలకు మంచి స్పందన వచ్చింది.

Y MOVIE

ఇప్పుడు మరో డిఫరెంట్ థ్రిల్లర్‌ని ప్రేక్షకులముందుకు తీసుకొస్తుంది ‘ఆహా’.. ఇటీవల ‘అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో శ్రీకాంత్ (శ్రీరామ్), రాహుల్ రామకృష్ణ, అక్షయ చందర్ మెయిన్ లీడ్స్‌గా థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమా ‘వై’..

బుధవారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమా డైరెక్టర్‌‌కి, రైటర్‌కి మధ్య ఓ సినిమా గురించి జరిగిన సంఘటనలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి అనేది ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి. ఏప్రిల్ 2 నుండి ‘వై’ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.