YS Sharmila Arrest: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల అరెస్ట్.. ఎస్ఆర్‌ నగర్ పీఎస్ వద్ద హైటెన్షన్..

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

YS Sharmila Arrest: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల అరెస్ట్.. ఎస్ఆర్‌ నగర్ పీఎస్ వద్ద హైటెన్షన్..

YS Sharmila

YS Sharmila Arrest: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోమవారం వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్, వైఎస్ఆర్ టీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సుందర్శన్ రెడ్డిపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల కారవాన్‌కు నిప్పంటించారు. వైఎస్సార్ విగ్రహం, ప్లెక్సీలను ధ్వంసం చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలీసులు షర్మిల పాదయాత్రను అడ్డుకొని ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ లోని ఆమె కార్యాలయంకు తరలించారు.

YS Sharmila: వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్

కాగా, టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిని తీవ్రంగా ఖండిస్తూ, పాదయాత్రను అడ్డుకోవటం పట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తూ షర్మిల, ఆ పార్టీ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లారు. టీఆర్ఎస్ నేతల దాడిలో సోమవారం స్వల్పంగా ధ్వంసమైన కారులోనే స్వయంగా కారు నడుపుకుంటూ షర్మిల వెళ్లారు. ఈ క్రమంలో సోమాజికగూడ వద్ద పోలీసులు వారిని అడ్డుకోవటంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు బలవంతంగా షర్మిలను అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేయగా కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో పోలీసులు షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అనంతరం కారు డోర్ తెరిచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

YS Sharmila : కోట్లు ఇచ్చి.. మునుగోడులో ఓటర్లను టీఆర్ఎస్ కొనుగోలు చేసింది-షర్మిల

పోలీస్ స్టేషన్ వద్ద షర్మిల కారు డోర్‌ను మెకానిక్ సహాయంతో బలవంతంగా తెరిచి షర్మిలను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. నాపై ఎందుకు దాడి చేస్తున్నారు? పాదయాత్రను కావాలనే అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అడ్డుకుంటారా అంటూ నిలదీశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించకూడదా? అవినీతిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అంటూ నిలదీశారు. అన్నీ వాళ్లే చేసి మేం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నామంటూ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితిగా మారిందని షర్మిల విమర్శించారు. షర్మిల అరెస్టు సందర్భంగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు, వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.