‘కె.జి.యఫ్ 2’ రిలీజ్ రోజు నేషనల్ హాలిడే!..

‘కె.జి.యఫ్ 2’ రిలీజ్ రోజు నేషనల్ హాలిడే!..

Yash Fans: రాకింగ్ స్టార్ యష్ ఫ్యాన్స్ తమ డిమాండ్ నెరవేర్చాలని ఏకంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి లెటర్ రాశారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజుని నేషనల్ హాలిడేగా ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

యష్ హీరోగా.. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్నభారీ బడ్జెట్ చిత్రం ‘కె.జి.యఫ్’ చాప్టర్ 2. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించగా ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది.

‘కె.జి.యఫ్ 2’ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఏ సినిమా టీజర్ సాధించలేని రికార్డ్ రాకీ భాయ్ క్రియేట్ చేశాడు. విడుదలైన కొద్ది గంటలకే 100 మిలియన్ల మార్క్ టచ్ చేసింది టీజర్.

ఇక ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. జూలై 16న ‘కె.జి.యఫ్ 2’ విడుదల కానుంది. కాగా తమ హీరో సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతున్న నేపథ్యంలో జూలై 16వ తేదీని నేషనల్ హాలిడేగా డిక్లేర్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి లెటర్ రాశారు యష్ ఫ్యాన్స్.

https://10tv.in/kgf-chapter-2-worldwide-theatrical-release-on-july-16th-2021/

శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ ‘అధీరా’, రవీనా టాండన్ ‘రమికా సేన్’ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ‘కె.జి.యఫ్ 2’ సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతోంది.