Bomb threat to Yogi: సీఎం యోగికి బాంబు బెదిరింపు

''ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్'' హోర్డింగులపై యోగి ఆదిత్యనాథ్ ముఖానికి మసిపూసి ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు శనివారంనాడు రెండు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మూడు హోర్డింగ్‌లలో ముఖ్యమంత్రి ముఖాన్ని తొలగించారని, దీనిపై రెండు ఎప్ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా మెజిస్ట్రేట్ రవి రంజన్ తెలిపారు. సమాచారం తెలియగానే పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని హోర్డింగ్‌లను మార్చారు. హోర్డింగ్‌లను డ్యామేజ్ చేసిన వారిని కనిపెట్టేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

Bomb threat to Yogi: సీఎం యోగికి బాంబు బెదిరింపు

Yogi received death threats for 2nd time in a week

Bomb threat to Yogi: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‭కి బాంబు బెదిరింపులు వచ్చాయి. లేఖ ద్వారా యోగికి బాంబు బెదిరింపులు వచ్చినట్లు యూపీ పోలీసులు శనివారం వెల్లడించారు. లక్నోలోని అలీంబాగ్‌ నివాసి అయిన దేవేంద్ర తివారీ ఇంట్లోని బ్యాగులో లేఖ లభించిందని.. అందులో ముఖ్యమంత్రి యోగి, దేవేంద్ర తివారీని పేల్చేస్తామంటూ రాసి ఉందని వారు పేర్కొన్నారు. కాగా, దీనికి కొద్ది రోజుల ముందు యోగికి వాట్సాప్ ద్వారా హత్యా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. షాహిద్ అనే వ్యక్తి డయల్-112 నంబర్‭కి వాట్సాప్ ద్వారా ఈ బెదిరింపులు చేశాడట. ఒకే వారంలో యోగికి రెండు సార్లు బెదిరింపు రావడంపై యూపీ పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు.

దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాల్ని జరుపుకుంటున్న తరుణంలో కొంత మంది నేతలకు ఇలా బెదిరింపులు వస్తున్నాయి. ఇలాంటి పరిణామాలను ఊహించే కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని జరపనుంది. ఇక యూపీ ముఖ్యమంత్రికి ఒకే వారంలో రెండుసార్లు బెదిరింపులు రావడంతో యూపీ రాజధాని లఖ్‭నవూలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 15న ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా చూసుకుంటామని యూపీ పోలీసులు చెబుతున్నారు.

”ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్” హోర్డింగులపై యోగి ఆదిత్యనాథ్ ముఖానికి మసిపూసి ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు శనివారంనాడు రెండు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మూడు హోర్డింగ్‌లలో ముఖ్యమంత్రి ముఖాన్ని తొలగించారని, దీనిపై రెండు ఎప్ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా మెజిస్ట్రేట్ రవి రంజన్ తెలిపారు. సమాచారం తెలియగానే పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని హోర్డింగ్‌లను మార్చారు. హోర్డింగ్‌లను డ్యామేజ్ చేసిన వారిని కనిపెట్టేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

Viral Video: తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ కారుపై చెప్పు విసిరిన బీజేపీ కార్యకర్తలు