యోగినీ ఏకాద‌శి గురించి తెలుసా..ఉప‌వాసం ఎందుకు

  • Published By: madhu ,Published On : June 16, 2020 / 07:17 AM IST
యోగినీ ఏకాద‌శి గురించి తెలుసా..ఉప‌వాసం ఎందుకు

ఏకాద‌శి..ద్వాద‌శి విన్నా..ఏంటీ యోగిని ఏకాద‌శి ఏంటీ అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా. అవును యోగిని ఏకాద‌శి రోజున కొంత‌మంది ఉప‌వాసం ఉంటారు. 2020, జూన్ 16వ తేదీ మంంగ‌ళ‌వారం ఉద‌యం 5 గంట‌ల 40 నిమిషాల‌కు ప్రారంభ‌మైంది. జూన్ 17వ తేదీ బుధ‌వారం  7 గంట‌ల 50 నిమిషాల వ‌ర‌కు ఉండ‌నుంది. జూన్ 18వ తేదీ 9 గంట‌ల 39 నిమిషాల వ‌ర‌కు దీక్ష కొన‌సాగ‌నుంది. సాధార‌ణంగా ఆషాడ మాసంలో శుక్ల‌ప‌క్షంలో వ‌స్తుంటుంద‌ని, ప్ర‌జ‌లు ఉప‌వాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు. 

దీనికి సంబంధించి ఓ క‌థ ప్ర‌చారంలో ఉంది. హిందూపురాణాల ప్ర‌కారం…ఓ తోట‌మాలి అస్వ‌స్థ‌త‌కు గురై..ముని ఆశ్ర‌మంలో ఆశ్ర‌యం పొందాడు. ఆ రోజు ఉప‌వాసం ఉండి..పూజ‌లు చేయాల‌ని ముని చెప్పాడు. అదే విధంగా చేయ‌డంతో అత‌ని ఆరోగ్యం మెరుగుప‌డింది. దీంతో ఆ రోజు యోగినీ ఏకాద‌శిగా పేరు వ‌చ్చింది. ఉప‌వాసం ఉండి..క‌ర్మ‌కాండ‌లు చేయ‌డం వ‌ల్ల‌…వారికి ముక్తి ల‌భిస్తుంద‌ని చాలా మంది న‌మ్ముతారు. 

2020 సంవ‌త్స‌రంలో యోగినీ ఏకాద‌శి సంద‌ర్భంగా…ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల పుణ్యం వ‌స్తుంద‌ని అంటుంటారు. ఉప‌వాసాలు, పూజ‌లు చేయ‌డం వ‌ల్ల చేసిన పాపాలు తొల‌గిపోతాయ‌ని వారి వారి విశ్వాసం. ఓం న‌మో నారాయ‌ణయ ..హిందువుల విశ్వాసం ప్ర‌కారం..యోగినీ ఏకాద‌శి పాటించ‌డం చాలా ముఖ్య‌మైంద‌ని అంటుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేస్తారు. ఆరోగ్య వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి అతి ముఖ్య‌మైన ఏకాద‌శిగా చెబుతుంటారు.

ఆడ‌వారైనా..మ‌గ‌వారైనా పాపాల నుంచి విముక్తి పొంద‌డ‌మే కాకుండా..అనేక వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం, మంచి ఆరోగ్యం వ‌స్తుంద‌ని అంటుంటారు. యోగినీ వ్ర‌తాన్ని ఒక్క‌సారైనా ఆచ‌రిస్తే..శ్రేయ‌స్సు, ఆరోగ్యం, విజ‌యం ల‌భిస్తుందంటున్నారు. విష్ణుమూర్తిని పూజిస్తుంటారు. ఉప‌వాస నియ‌మాలు పాటించ‌డం, విష్ణు స‌హ‌స్త్ర నామాలు ప‌టించాల‌ని చెబుతుంటారు. అంతేగాకుండా..తోచిన విధంగా దానాలు చేయాలంటుంటారు. 

యోగిని ఏకాద‌శి : –
పురాణాల ప్ర‌కారం..హేమ‌మాలి అనే తోట‌మాలికి అంద‌మైన భార్య విశాక్షి ఉండేది. అన‌కాపురి రాజ్యంలో ఒక ఉద్యాన‌వ‌న తోట‌మాలిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించే వాడు హేమ‌మాలిని. రాజు కుబేరుడు. రాజు శివుడు భ‌క్తుడు. పూజ‌లు, ప్రార్థ‌న‌లు చేసేవాడు. మాన‌స స‌రోవ‌రం నుంచి తాజా పూలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈ పూల‌తో కుబేరుడు..శివుడిని ప్రార్థించేవాడు. ఓ రోజు కుబేరుడికి పూలు తీసుక‌రాలేదు. ఎందుకు ఆల‌స్యం అయ్యింద‌ని భ‌టుల‌ను హేమ‌మాలి వ‌ద్ద‌కు పంపిస్తాడు. ఆ స‌మ‌యంలో హేమ‌మాలి..త‌న భార్య‌తో ఉంటాడు.

ఇదే విష‌యాన్ని రాజుకు చెబుతారు భ‌టులు. వెంట‌నే హేమ‌మాలిని పిలిపించుకుంటాడు. కుష్టు వ్యాధితో బాధ ప‌డాల‌ని..భార్య నుంచి విడిపోవాల‌ని హుకుం జారీ చేస్తాడు. అడ‌విలో కుష్టు వ్యాధితో బాధ ప‌డుతుంటాడు. అక్క‌డ మార్కండేయ ఆశ్ర‌మానికి చేరుకుంటాడు. శాపానికి సంబంధించిన విష‌యాలు చెబుతాడు. శాప విముక్తి క‌లిగించాల‌ని మునిని కోరుతాడు.

ఆషాడ మాసంలో కృష్ణ‌ప‌క్షంలో వ‌చ్చే ఏకాద‌శి రోజున దీక్ష ఉండాల‌ని..విష్ణుమూర్తిని పూజించాల‌ని చెబ‌తాడు. అత్యంత శ్ర‌ద్ధ‌, భ‌క్తితో పూజ‌లు చేస్తాడు. విష్ణుమూర్తి ఆశీస్సులు పొంది..శాపం నుంచి విముక్తి వ‌స్తుంది. పూర్వ రూపం రావ‌డ‌మే కాకుండా..భార్య‌తో సంతోష‌క‌ర‌మైన జీవితం గ‌డుపుతాడు.