Kingcobra : ఒట్టి చేతులతో కింగ్ కోబ్రాను పట్టుకుని ఆటాడించిన యువతి

ఒట్టి చేతులతో కింగ్ కోబ్రోను పట్టుకుని ఆటాడించిన యువతి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 10అడుగుల కింగ్ కోబ్రోను అత్యంత చాకచక్యంగా పట్టుకుని యువతి ధైర్యం చూస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

10TV Telugu News

Woman catches giant snake with bare hands : ఓ చిన్నపాము కనిపించినా గుండెలు దడదడలాడిపోతాయి. అటువంటిది ఏ భారీ నాగుపాము కనిపిస్తే ఇక కాళ్లు వణికిపోతాయి. పై ప్రాణాలు పైనే పోతాయి. కాళ్లకు బుద్ధి చెప్పి అక్కడ నుంచి క్షణాల్లో పారిపోతాం. వెనక్కి తిరిగి చూడటానికి కూడా ధైర్యం చాలదు. కానీ ఓ యువతి మాత్రం ఏకంగా ఓ కాలనాగుని చిటికెలో పట్టేసుకుంది. చిన్నపాటి కర్రతో ఆ పాముని ఆడించి అత్యంత చాకచక్యంగా ఒట్టి చేతులతో పట్టుకోవటం విశేషం. ఆ యువతి కంటే డబులు పొడుగు ఉందా కింగ్ కోబ్రో.

ఆమె పాముని పట్టుకోగానే అక్కడే ఉండే మగవాళ్లంతా బైటకు పారిపోయారు. మరి ఆ యువతి ధైర్యం చూస్తే ఎంతటి ధైర్యవంతులకైనా చెమటలు పట్టాల్సిందే. ఓ చిన్న ఇరుగు గదిలో ఏకంగా 10 అడుగుల పొడవు ఉన్న నాగుపాము పైగా అది సాధారణ నాగు కాదు..కింగ్ కోబ్రో. అటువంటి కింగ్ కోబ్రోను ఒట్టి చేతులతో ఒడుపుగా పట్టేసుకుని ఏదో బొమ్మతో ఆడినట్లుగా నాగుల రాణి అన్నట్లుగా దాంతో కాసేపు ఆడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఓ యువతి ఓ చిన్న రూములో 10 అడుగులకు పైనే పొడవు ఉన్న కింగ్ కోబ్రోను పట్టుకున్న విధానం ఎంతటి ధైర్యవంతులకైనా చెమటలు పట్టిస్తుంది. అత్యంత చాకచక్యంగా ఆ పామును పట్టుకోవటానికి ఓ చిన్న కర్రను మాత్రమే ఆమె ఉపయోగిచింది.అదికూడా ఆ పాముని డైవర్ట్ చేయటానికి. పామును పట్టుకునే క్రమంలో ఆమె పాముకాటుకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అయినా ఒట్టిచేతులతోనే దాన్ని ఆడించింది.

పట్టుకోవటానికి దాని పడగను కూడా రెండు మూడు సార్లు టచ్ చేసింది. దాంతో ఆ కింగ్ కోబ్రో కాటు వేయటానికి పలుమార్లు యత్నించింది. కానీ ఎంతో లాఘవంగా..అత్యంత వేగంగా పాము కదలికల నుంచి తప్పించుకుంటు అతి తక్కువ సమయంలోనే కింగ్ కోబ్రాను చేతులతో ఒడిసి పట్టుకుంది. పట్టుకున్న తరువాత ఆమె తలపై వరకు పైకి లేచింది. ఆ తరువాత ఆ పాముని బయటకు తీసుకు వచ్చి రోడ్డుపై వదిలి మరోసారి దాని పడగను ఒడిసి పట్టుకున్న వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్ తో వైరల్ అవుతోంది.

 

10TV Telugu News