MS Dhoni: కెప్టెన్‌గా ధోనీకి ఘన స్వాగతం.. వచ్చే ఏడాదిపై ఏం చెప్పాడంటే

ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటముల నేపథ్యంలో తిరిగి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై తలపడుతోంది.

MS Dhoni: కెప్టెన్‌గా ధోనీకి ఘన స్వాగతం.. వచ్చే ఏడాదిపై ఏం చెప్పాడంటే

Ms Dhoni

MS Dhoni: ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటముల నేపథ్యంలో తిరిగి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై తలపడుతోంది. ఈ నేపథ్యంలో టాస్ కోసం కెప్టెన్‌గా స్టేడియంలోకి అడుగుపెట్టాడు ధోని. ఈ సీజన్‌లో మొదటిసారి కెప్టెన్‌గా స్టేడియంలోకి రావడంతో ఫ్యాన్స్ అరుపులు, కేకలతో స్టేడియాన్ని హోరెత్తించారు. కెప్టె‌న్‌గా ధోనీకి ప్రేక్షకుల నుంచి ఘన స్వాగతం లభించింది. కాగా, ఈ టాస్ హైదరాబాద్ నెగ్గింది.

IPL2022 DC Vs LSG : ఉత్కంఠపోరులో ఢిల్లీపై లక్నో విజయం.. రెండో స్థానానికి రాహుల్ సేన

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్‌తో తన ప్రయాణం గురించి చెప్పాడు. వచ్చే ఏడాది కూడా తనను యెల్లో జెర్సీలో చూస్తారని హామీ ఇచ్చాడు. ఇంతకుముందు చెన్నై కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నధోని, వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కొనసాగుతాడా.. లేదా.. అనే అంశంపై కొంతకాలంగా సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో తాజాగా ధోని మాటలతో క్లారిటీ వచ్చినట్లైంది.