బాలయ్య డిజాస్టర్ మూవీతో పోలికా?

బాలయ్య డిజాస్టర్ మూవీతో పోలికా?

Sandeep Madhav: ‘వంగవీటి’, ‘జార్జి రెడ్డి’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘గంధర్వ’ (బ్యాక్ టు లవ్) అనేది ట్యాగ్ లైన్.. అప్సర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘గుడుంబా శంకర్’ మూవీ డైరెక్టర్ వీర శంకర్ స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం.

ఈ సినిమాలో సందీప్ మిలటరీ అధికారిగా కనిపించనున్నాడు. సినిమా ఓపెనింగ్ సందర్భంగా ‘గంధర్వ’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్ సందీప్ లుక్ బాలయ్య డిజాస్టర్ మూవీ ‘విజయేంద్ర వర్మ’ తో కంపేర్ చేస్తున్నారు. సందీప్ గెటప్, ‘విజయేంద్ర వర్మ’ లో బాలయ్యలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Sandeep Madhav