పెళ్లిపీట‌ల మీద నుంచి వెళ్లిపోయి.. ప్రియుడిని పెళ్లాడింది!

పెళ్లిపీట‌ల మీద నుంచి వెళ్లిపోయి.. ప్రియుడిని పెళ్లాడింది!

Young Girl Married Lover : ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, పెద్దలు ఎప్పటిలానే పెళ్లికి ఒప్పుకోలేదు.. ఇష్టం లేకపోయినా పెళ్లికి అంగీకరించింది. పెళ్లి పీటలెక్కడానికి ముందే తన మనస్సు మార్చుకుంది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయి తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడింది. ఈ ఘటన మహబూబా బాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో జరిగింది.

కొద్దిసేపట్లో పెళ్లిపీటలపై వరుడితో తాళికట్టించుకోవాల్సిన వధువు మండపం నుంచి పారిపోయింది. తానొక అబ్బాయిని ప్రేమించానని, ఇష్టం లేకపోయిన తనకు మరొకరితో పెళ్లి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మ‌హ‌బూబాబాద్ జిల్లా కుర‌వి మండ‌లం కాంపెల్లికి చెందిన దివ్య అదే గ్రామానికి చెందిన కొల్లు న‌రేశ్‌ను ప్రేమించిన‌ట్టు పెద్దలకు చెప్పింది.

వారు ఒప్పుకోకపోవడంతో పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసుల రంగ ప్రవేశంతో యువతి పెళ్లి ఆగిపోయింది. మహబూబాబాద్ మండలం అనంతారం జగన్నాథ వెంకటేశ్వర ఆలయంలో నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. యువ జంట దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.