Young Heros : వరుస ఫ్లాప్స్.. అయినా వరుస ఆఫర్లతో బిజీగానే ఉన్న యువ హీరోలు..

కొంతమంది యువ హీరోలకి కెరీర్ లో హిట్స్ కన్నా ఫ్లాప్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎన్ని సినిమాలు చేస్తున్నా ఫ్లాపులతో దండయాత్ర తప్పడంలేదు. అయినా సరే ప్రయత్నం మానడం లేదు. దానికి ఎంతో ఓపిక కావాలి. చాలా ఓపికతో వరుస సినిమాలు చేస్తూ

Young Heros : వరుస ఫ్లాప్స్.. అయినా వరుస ఆఫర్లతో బిజీగానే ఉన్న యువ హీరోలు..

Young Heros : కొంతమంది యువ హీరోలకి కెరీర్ లో హిట్స్ కన్నా ఫ్లాప్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎన్ని సినిమాలు చేస్తున్నా ఫ్లాపులతో దండయాత్ర తప్పడంలేదు. అయినా సరే ప్రయత్నం మానడం లేదు. దానికి ఎంతో ఓపిక కావాలి. చాలా ఓపికతో వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు కొంతమంది టాలీవుడ్ యువ హీరోలు.

ఎన్ని ఫ్లాపులొస్తున్నా ఆగని అవకాశాలతో తన కెరీర్ బండి లాగిస్తున్న యంగ్ హీరో ఆది సాయికుమార్. అదేం బ్యాడ్ లక్కో గానీ డెబ్యూ మూవీ ‘ప్రేమకావాలి’, ఆ నెక్స్ట్ మూవీ ‘లవ్లీ’, ఆ తర్వాత సుకుమారుడు సినిమా తప్ప తన కెరీర్ లో మరో హిట్టన్నదే లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నిస్తున్నా, జోనర్ మార్చి, గెటప్పులు మార్చుతున్నా హిట్టన్నది కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే అతిథిదేవో భవ, తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెలో సినిమాలు ఆడాయి నుంచి రాగా ఈ మూడు కూడా పరాజయం పాలయ్యాయి. ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఆది చేతిలో ఇంకా టాప్ గేర్, కిరాతక, సియస్ఐ సనాతన్, అమరన్ ఇన్ ది సిటీ, జంగిల్ సినిమాలు ఉన్నాయి. మరిన్ని సినిమా ఆఫర్స్ కూడా ఆవస్తున్నట్టు సమాచారం. హిట్లు కొట్టకపోయిన వరుస సినిమాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు ఆది. మరి ఆదికి ఏ సినిమా హిట్ ఇస్తుందో చూడాలి.

 

హీరో శ్రీవిష్ణు కొత్తదనానికి పెద్ద పీట వేస్తాడు. సినిమా సినిమాకీ వైవిధ్యమైన కథలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనే తాపత్రయం ఎక్కువుంది. గతంలో మెంటల్ మదిలో, అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా సినిమాలు మంచి విజయం సాధించాయి. కానీ ఇటీవల శ్రీవిష్ణుని కూడా వరుస ఫ్లాప్స్ వెంటాడుతున్నాయి. తిప్పరా మీసం, గాలి సంపత్, భళాదందనాన, అర్జున ఫల్గుణా, అల్లూరి.. ఇలా వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ శ్రీవిష్ణుకి ఇంకా ఆఫర్స్ వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం శ్రీవిష్ణు చేతిలో మూడు సినిమాలు ఉన్నట్టు సమాచారం. మరి శ్రీవిష్ణుకి మళ్ళీ హిట్ ఎప్పుడొస్తుందో చూడాలి.

ఇక ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో కార్తికేయ. అతడి బ్యాడ్ లక్కో ఏంటో కానీ అదే ఫస్ట్ అండ్ లాస్ట్ హిట్ లా మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘హిప్పి, గుణ 369, 90 యం.ఎల్, చావుకబురు చల్లగా, రాజా విక్రమార్క’ లాంటి సినిమాలు పరాజయం పాలయ్యాయి. మధ్యలో నాని ‘గ్యాంగ్ లీడర్’, అజిత్ ‘వలిమై’ సినిమాల్లో విలన్ గా నటించినా అవి కారికేయ కెరీర్ కి అంతగా ఉపయోగపడలేదు. ప్రస్తుతం కార్తికేయ చేతిలో కూడా రెండు సినిమాలు ఉన్నాయి. మరి ఇవైనా హిట్ ఇస్తాయేమో చూడాలి.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఈ లిస్ట్ లోకి చేరతాడు. ‘రాజావారు రాణిగారు’ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఓకే అనిపించుకుని ‘యస్.ఆర్ కళ్యాణమండపం’తో పర్వాలేదనిపించుకున్నా ఆ తర్వాత ‘సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడ్ని అంటూ వరుస ఫ్లాపులు టేస్ట్ చేశాడు. అయినప్పటికీ మనోడి అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్.. సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరిన్ని సినిమాలకి కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఈ యువ హీరోకి ఒక పెద్ద హిట్ అయితే కావాలి. మరి ఆ హిట్ ఏ సినిమా ఇస్తుందో చూడాలి.

టాలీవుడ్ సిక్స్ ప్యాక్ యంగ్ హీరోల్లో సుధీర్ బాబు ముందు వరుసలో ఉంటాడు. మహేశ్ బాబుకు స్వయానా బావ అవడం వల్ల ఆఫర్స్ కు ఎలాంటి ఢోకా ఉండడం లేదు. కానీ ఇటీవల సుధీర్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాడు. ప్రేమ కథా చిత్రం, సమ్మోహనం తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే పడలేదు. వరుసగా నన్ను దోచుకుందువటే, వీరభోగ వసంతరాయలు, V, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల వచ్చిన ‘ఆ అమ్మయి గురించి మీకు చెప్పాలి’ సినిమా బాగున్నా కలెక్షన్స్ రాలేదు. అయినా ఈ హీరో చేతిలో కూడా వరుస సినిమాలు ఉన్నాయి. హంట్, పుల్లెల గోపీచంద్ బయోపిక్, మామా మశ్చీంద్ర సినిమాలు చిత్రీకరణలో ఉండగా మరో రెండు సినిమాలు ఓకే చేశాడు. మరి వీటిల్లో సుధీర్ కి హిట్ ఇచ్చే సినిమా ఏదో చూడాలి.

Ram Charan : బుచ్చిబాబుకి చరణ్ ఓకే చెప్పాడా??

టాలీవుడ్ లో మరో సిక్స్ ప్యాక్ యంగ్ హీరో నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే, కళ్యాణ వైభోగమే, ఛలో సినిమాలతో హిట్స్ కొట్టిన నాగ శౌర్య ఆ తర్వాత హిట్ సినిమానే చూడలేదు. అమ్మమ్మగారిల్లు, నర్తన శాల, అశ్వథ్థామ, లక్ష్య సినిమాలు ఫ్లాప్స్ అవ్వగా వరుడు కావలెను, కృష్ణ వ్రింద విహారి సినిమాలు పర్వాలేదనిపించాయి. అయినా ఈ హీరో చేతిలో కూడా ఇప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారీ నారీ నడుమ మురారి, పోలీసువారి హెచ్చరిక.. సినిమాలు ఉండగా మరిన్ని లైన్లో పెడుతున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న నాగశౌర్యకి త్వరలో హిట్ కూడా వస్తుందేమో చూడాలి.