Young Heros : నిర్మాతలుగా మారుతున్న యువ హీరోలు..

 ప్రజెంట్ యంగ్ హీరోస్ కెమేరా ముందుకు రావడంతోనే సరిపెట్టడం లేదు. కెమెరా వెనుక ఉండడానికి కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. సినీ నిర్మాణ రంగంలో కూడా అడుగుపెడుతూ.............

Young Heros : నిర్మాతలుగా మారుతున్న యువ హీరోలు..

Young Heros :  ప్రజెంట్ యంగ్ హీరోస్ కెమేరా ముందుకు రావడంతోనే సరిపెట్టడం లేదు. కెమెరా వెనుక ఉండడానికి కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. సినీ నిర్మాణ రంగంలో కూడా అడుగుపెడుతూ తమ క్రేజ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల చాలా మంది యువ హీరోలు ఈ బాట పడుతున్నారు.

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు సొంతంగా బ్యానర్స్ పెట్టి బెస్ట్ మూవీస్ ప్రొడ్యూస్ చేసి ఆ బ్యానర్స్ ని ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు నేటితరం కుర్ర హీరోలు. ఇప్పుడు చాలా మంది యంగ్ హీరోలకు దాదాపుగా సొంత బ్యానర్స్ ఉన్నాయి. ఒక వైపు హీరోగా కెరీర్ ని బాలెన్స్ చేస్తూనే మరో వైపు నిర్మాతగా తమ మార్క్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వెరైటీ స్టోరీలతో, పర్ఫార్మెన్స్ కు బాగా స్కోపున్న పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ తన మార్కు చూపించే హీరో నేచురల్ స్టార్ నాని. కెరీర్ బిగినింగ్ లోనే ‘డీ ఫర్ దోపిడీ’ అనే మూవీ కోసం నిర్మాణ భాగస్వామిగా సత్తా చాటుకున్నారు నాని. ఆ తర్వాత వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ స్థాపించి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ‘అ!’ అనే సినిమా నిర్మించాడు. డబ్బులు అంతగా రాకపోయినా పేరు, అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత ఇదే బ్యానర్ పై విశ్వక్ సేన్ హీరోగా ‘హిట్’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నిర్మించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టవడంతో మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఇప్పుడు అదే బ్యానర్ పై ‘హిట్ 2’ అనే మూవీని నిర్మిస్తున్నాడు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది.

ప్రజెంట్ టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ లో ఒకడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నిర్మాతగా మారాడు. అయితే నిర్మాతగా మారింది కేవలం తన తండ్రి కోసమే అని చెప్పేశాడు చరణ్. కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తూ వి వి వినాయక్ దర్శకత్వంలో తీసిన ‘ఖైదీ నంబర్ 150’ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రెండో ప్రయత్నంగా చిరంజీవితోనే ‘సైరా’ సినిమా నిర్మించాడు కానీ అంతగా వర్కవుట్ కాలేదు. ఇక చెర్రీ నిర్మాణ భాగస్వామిగా నిర్మించిన మూడో సినిమా ‘ఆచార్య’ డిజాస్టర్ అవగా రీసెంట్ గా నిర్మించిన ‘గాడ్ ఫాదర్’ సూపర్ హిట్టయింది.

జయం సినిమాతో హీరోగా పరిచయం అయిన నితిన్, ఆపై పలు హిట్ చిత్రాలతో తెలుగులో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆ తరువాత వరుసగా పరాజయాలు రావడంతో తన ప్లాప్ కు బ్రేక్ వేసుకోవాలన్న ఆలోచనతో సొంతగా శ్రేష్ట్ మూవీస్ ని స్థాపించి తొలి ప్రయత్నంగా ‘ఇష్క్’ సినిమా నిర్మించాడు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క సంచలన విజయం అందుకోవడంతో నిర్మాతగా, అటు హీరోగా సక్సెస్ అయ్యాడు నితిన్. ఆ తరువాత ‘గుండెజారి గల్లంతయిందే’ నిర్మించాడు ఆ సినిమా సూపర్ హిట్, కానీ క్రేజీ దర్శకుడు కరుణాకరన్ తో ఆ తరువాత తీసిన ‘చిన్నదాన నీకోసం’ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. నితిన్ తన మిత్రుడు అఖిల్ ని హీరోగా పరిచయం చేస్తూ ‘అఖిల్’ సినిమా నిర్మించాడు. కానీ అది డిజాస్టర్ అయింది. రీసెంట్ గా రిలీజైన ‘మాచర్ల నియోజక వర్గం’ మూవీని కూడా నితిన్ నిర్మించగా అది కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది.

 

యంగ్ హీరో శర్వానంద్ నిర్మాతగా మారుతూ శర్వా ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి తొలి ప్రయత్నంగా ‘కో అంటే కోటి’ చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. మరో హీరో సందీప్ కిషన్ కూడా నిర్మాతగా అవతారం ఎత్తి తోలి ప్రయత్నంగా వెంకటాద్రి టాకీస్ బ్యానర్ ని స్థాపించి ‘నిను వీడని నీడను నేను’ అంటూ ఓ సినిమా నిర్మించాడు. ఇప్పుడు వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు సందీప్. మరో హీరో సుధీర్ బాబు కూడా సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ స్థాపించి తొలి ప్రయత్నంగా ‘నన్ను దోచుకుందువటే’ సినిమా తీసి పర్వాలేదనిపించుకున్నాడు.

Unni Mukundan : సరోగసి అంత ఈజీ కాదు.. సమంత సెట్‌లో ఎవరికీ ఆ విషయం చెప్పలేదు..

నందమూరి కళ్యాణ్ రామ్.. నందమూరి వారసుడిగా రంగప్రవేశం చేసిన కళ్యాణ్ రామ్ హీరోగా నిలదొక్కుకున్నాక తన తాత నందమూరి తారక రామారావు పేరుతో 2005 లోనే సొంత బ్యానర్ ని మొదలు పెట్టాడు. ఆ బ్యానర్ లో తానే హీరోగా నటిస్తూ నిర్మించిన ‘అతనొక్కడే’ మూవీ సంచలన విజయం సాధించింది. హరే రామ్, జయీభవ, కత్తి , ఓం 3డి, పటాస్, కిక్ -2, ఇజం, జై లవకుశ లాంటి సినిమాలు నిర్మించాడు. కొద్ది గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ ఇటీవల నిర్మించిన సోషియో ఫాంటసీ మూవీ ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా దాదాపు రూ. 65 కోట్లు వసూళ్ళు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంది.

ఇక ఇటీవల యంగ్ సెన్సేషన్ విశ్వక్ సేన్ కూడా మొదట్లోనే నిర్మాతగా ఫలక్ నామా దాస్ సినిమాని తనే హీరోగా చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు త్వరలో ధమ్కీ సినిమాని తనే హీరోగా నిర్మిస్తున్నాడు. ఇక రానా తన తాత స్థాపించిన సురేష్ ప్రొడక్షన్ ని నడిపిస్తున్నారు. ఇలా పలువురు యువ హీరోలు నిర్మాణ రంగంలోనూ భాగమవుతున్నారు.