Nellore: బీచ్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన మత్స్యకారులు!

మెడిసిన్ చదువుతున్న ఓ యువకుడు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించి సముద్రంలో దూకాడు. అయితే, బీచ్ వద్దకు వెళ్లేముందే తల్లిదండ్రులతో మాట్లాడిన యువకుడు తన బాధను పంచుకొని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పాడు. అయితే.. ఎక్కడ, ఎలా ఆత్మహత్యకి పాల్పడుతున్నాడో తల్లిదండ్రులకు తెలియదు.

Nellore: బీచ్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన మత్స్యకారులు!

Young Man Commits Suicide On Maipadu Beach Fishermens Rescued

Nellore: మెడిసిన్ చదువుతున్న ఓ యువకుడు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించి సముద్రంలో దూకాడు. అయితే, బీచ్ వద్దకు వెళ్లేముందే తల్లిదండ్రులతో మాట్లాడిన యువకుడు తన బాధను పంచుకొని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పాడు. అయితే.. ఎక్కడ, ఎలా ఆత్మహత్యకి పాల్పడుతున్నాడో తల్లిదండ్రులకు తెలియదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి యువకుడున్న ప్రాంతాన్ని గుర్తించి మత్య్సకారులకు సమాచారం ఇవ్వడంతో వారు యువకుడిని కాపాడారు.

నెల్లూరు జిల్లా మైపాడులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు తిరుపతికి చెందిన రోహిత్ నెల్లూరులోని ఓ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఏమైందో తెలియదుకానీ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకొని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు .దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించి తమ కుమారుని కాపాడాలని వేడుకున్నారు.

రంగంలోకి దిగిన స్థానిక ఎస్ఐ పీ.నరేష్.. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రోహిత్ మైపాడు పరిసర ప్రాంతాలలో ఉన్నట్లుగా గుర్తించాడు. వెంటనే రోహిత్ ఫోటోతో పాటు అతని బైక్ నెంబర్ ను వాట్సప్ ద్వారా మత్స్యకారులకు పంపించారు. మత్స్యకారులు రోహిత్ కోసం తీరం వెంబడి వెతుకుతుండగా సముద్రంలోకి ఏర్పాటు చేసిన వంతెన నుండి రోహిత్ సముద్రంలోకి దూకాడు. గమనించిన మత్య్సకారులు హుటాహుటిన సముద్రంలోకి వెళ్లి యువకుడిని కాపాడి బయటకి తీసుకొచ్చారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా యువకుడు దొరికే అవకాశం లేదని.. సమయసూర్తితో స్పందించిన మత్య్సకారులకు పోలీసులు, యువకుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు!