గూగుల్ సెర్చ్‌లోనూ వాట్సప్ గ్రూపులు యాక్సెస్ చేయొచ్చా!!

గూగుల్ సెర్చ్‌లోనూ వాట్సప్ గ్రూపులు యాక్సెస్ చేయొచ్చా!!

WhatsApp

WhatsApp: కొలీగ్స్ లేదా ఇతర పార్టనర్స్ మొత్తం కలిసి ఉన్న గ్రూపులో సడెన్‌గా ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడనుకోండి. ఇక అతనికి కాంటాక్ట్ నెంబర్లు, మన ప్రొఫైల్ ఇమేజెస్ మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు. గూగుల్ సెర్చ్ లో దొరికే ప్రైవేట్ చాట్ ఇలాగే జరిగేది. ఈ ఇష్యూను వాట్సప్ 2019లోనే ఫిక్స్ చేసింది. కాకపోతే అది మళ్లీ రిపీట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహరియా.. వాట్సప్ గ్రూపులు ఆన్ లైన్ నుంచి యూజర్లను ఎంటర్ అయ్యేందుకు ప్రేరేపిస్తున్నాయి. థియరిటికల్ ప్రతి ఒక్కరినీ గ్రూపులోకి జాయిన్ అయ్యేందుకు అనుమతి వచ్చేస్తుంది. ఇంగ్లీష్ మీడియా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా వెబ్ నుంచి వాట్సప్ గ్రూపులు జాయిన్ అవ్వొచ్చని కన్ఫామ్ చేసింది.

వాట్సప్ చాట్ లను ఎనేబుల్ చేసుకుని.. మనం వెదికిన దానికి తగ్గట్లు ప్రైవేట్ గ్రూప్స్ కు యాక్సెస్ ఇచ్చేయొచ్చు.. లేదా జాయిన్ అయిపోవచ్చు. గ్రూపులోకి ఇలా వచ్చిన వారిని ఎక్కువ మంది పెద్దగా పట్టించుకోరు. అంటే ఎవరో కొత్త వ్యక్తి కాసేపు వరకూ గ్రూపులో ఉండి కాంటాక్ట్ వివరాలు.. ప్రొఫెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత ఎగ్జిట్ అయిపోవచ్చు.

2019లో బగ్ సంగతేంటి?
2019లో ఇదే బగ్ ను కనిపెట్టారు సెక్యూరిటీ రీసెర్చర్. దానిని ఫేస్ బుక్ వరకూ తీసుకెళ్తే ఆ తర్వాత సాల్వ్ చేసి మీడియా అటెన్షన్ కొట్టేశారు. కొన్నాళ్ల వరకూ అది కనిపించకపోయినా ఇప్పుడు మరో బగ్ తో ఇబ్బంది వచ్చి పడింది.

ఇప్పటివరకూ గ్రూపు పేర్లు మాత్రమే గూగుల్ సెర్చ్ లో కనిపించినా.. ఇప్పుడు ప్రొఫైల్ పేర్లు కూడా ఇండెక్స్ అవుతున్నాయి. కొన్నిసార్లు వారి ఫోన్ నెంబర్లతో పాటు ప్రొఫైల్ పిక్చర్స్ కూడా దొరికేస్తున్నాయి. ఈ ఇష్యూను జూన్ 2020లోనే రిపోర్ట్ చేశారు.