Sidhu Moosewala: సిద్ధూ మూసేవాలా కొత్త పాట తొలగించిన యూట్యూబ్.. ఎందుకంటే..
ఆయన మరణం తర్వాత విడుదలైన తొలి పాట ఇదే. దీన్ని యూట్యూబ్‌లో ‘ఎస్‌వైఎల్’ పేరుతో ఈ నెల 23న విడుదల చేశారు. విడుదలైన మూడు రోజుల్లోనే 27 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అలాగే 3.3 మిలియన్ల లైక్స్ సొంతం చేసుకుంది.

Sidhu Moosewala: ఇటీవల మరణించిన ప్రముఖ పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా పాడిన తాజా పాటను తొలగించింది యూట్యూబ్. ఈ పాట నాలుగు రోజుల క్రితమే విడుదలవ్వడం విశేషం. గత నెల 29న సిద్ధూ మూసేవాలా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత విడుదలైన తొలి పాట ఇదే. దీన్ని యూట్యూబ్‌లో ‘ఎస్‌వైఎల్’ పేరుతో ఈ నెల 23న విడుదల చేశారు. విడుదలైన మూడు రోజుల్లోనే 27 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అలాగే 3.3 మిలియన్ల లైక్స్ సొంతం చేసుకుంది. ఇంత ఆదరణ పొందిన పాటను తొలగించేందుకు కారణం.. పాటలో కొన్ని వివాదాస్పద అంశాలకు చోటుండటమే.
Droupadi Murmu: ద్రౌపది ముర్ము సొంతూరుకు ఇన్నాళ్లకు కరెంటు సౌకర్యం
ఈ పాటలో వివాదాస్పద సట్లేజ్-యమున లింక్ (ఎస్‌వైఎల్) కెనాల్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ కెనాల్‌కు సంబంధించి నాలుగు దశాబ్దాలుగా హరియాణా, పంజాబ్ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ అంశం ప్రస్తావన ఉండటంతో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీంతో యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌పై పాటను తొలగించింది. అయితే, ఈ నిషేధం మన దేశం వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర దేశాల్లో మాత్రం పాట అందుబాటులో ఉంటుంది.