మద్యం మత్తులో వాహనాలను ఢీ కొట్టిన యూట్యూబ్ స్టార్‌ షణ్ముఖ్ జస్వంత్..

మద్యం మత్తులో వాహనాలను ఢీ కొట్టిన యూట్యూబ్ స్టార్‌ షణ్ముఖ్ జస్వంత్..

Shanmukh Jaswanth: తెలంగాణ సర్కార్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ బీభత్సం సృష్టిస్తున్న కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా నటుడు షణ్ముక్ జస్వంత్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు..

ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.. మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలను షణ్ముఖ్ కారు ఢీ కొట్టింది.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Shanmukh Jaswanth

ప్రమాదం జరిగిన సమయంలో అతను మోతాదుకి మించి మద్యం సేవించాడని, బ్రీత్ అనలైజర్ టెస్టులో 170 పాయింట్లుగా తేలడంతో కారు సీజ్ చేశామని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. కాగా షణ్ముఖ్ పలు వెబ్ సిరీస్‌లతో నటుడిగా, యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. యువతలో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది.