YS Sharmila : దీక్షలతోనే పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ..ఈ రెండు నెలల్లో ఏం చెయబోతున్నారు ?

దీక్షలతోనే తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తానంటున్నారు వైఎస్‌ తనయ షర్మిల. పార్టీ జెండా.. అజెండాను మాత్రం ప్రకటించని ఆమె.. దానికి ఇంకో రెండు నెలలు టైముందని చెప్పకనే చెప్పారు.

YS Sharmila : దీక్షలతోనే పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ..ఈ రెండు నెలల్లో ఏం చెయబోతున్నారు ?

Ys Sharmila

Hunger Strike : దీక్షలతోనే తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తానంటున్నారు వైఎస్‌ తనయ షర్మిల. పార్టీ జెండా.. అజెండాను మాత్రం ప్రకటించని ఆమె.. దానికి ఇంకో రెండు నెలలు టైముందని చెప్పకనే చెప్పారు. మరి ఈ రెండు నెలల్లో షర్మిల ఏం చేయబోతున్నారు..? తెలంగాణ ప్రత్యక్ష రాజకీయల్లోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారా..? మరి షర్మిల టీమ్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందా..?

ఖమ్మంలో సంకల్ప సభ : –
ఖమ్మంలో సంకల్ప సభ నిర్వహించారు వైఎస్‌ షర్మిల. తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టబోతున్నారనే దానిపై క్లారిటీ ఇచ్చారు. 18 ఏళ్ల క్రితం ఏప్రిల్ 9న తన తండ్రి చేసిన పాదయాత్రను గుర్తు చేసుకుంటూ.. ఉద్యమాల గుమ్మం ఖమ్మంలో తెలంగాణ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నానో చెప్పారామె. తన తండ్రి చేసిన అభివృద్ధి గురించి చెబుతూ.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ.. అధికార పార్టీ పని తీరుపై తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేజీ టూ పీజీ విద్య ఏమైందని.. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానన్న హామీ ఎక్కడని షర్మిల ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఊసే లేదన్న ఆమె.. సీఎం సార్‌ని నిలదీయాటనికే తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నానని కుండ బద్దలు కొట్టారు.

పార్టీలను టార్గెట్ చేసిన షర్మిల: –
అధికార టీఆర్‌ఎస్‌నే కాకుండా.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలనూ టార్గెట్‌ చేశారు షర్మిల. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్.. టీఆర్ఎస్‌కు ఎమ్మెల్యేలను సప్లయ్‌ చేసే పార్టీగా మారిందని.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అమ్ముడు పోయిందని రాఓపించారు. అటు బీజేపీపైనా నిప్పులు చెరిగారు షర్మిల. తెలంగాణలో బలపడేందుకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మందిపడ్డారు. పసుపు బోర్డు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నించారు. ఎవరు అవునన్నా కాదన్నా తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని చెప్పారు. ఎవరికీ భయడేది లేదని.. రానున్న రోజుల్లో తెలంగాణ గడ్డ మీద నిలబడి.. ప్రజల కోసం పోరాడుతానన్నారు. తనకు అవకాశం ఇవ్వాలా వద్దా.. అనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు షర్మిల.

15వ తేదీ నుంచి దీక్షలు : –
కొత్త పార్టీ పెట్టేందుకు ఇంకా టైమ్ ఉందంటూ.. ఈ గ్యాప్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న లక్షా తొంభై ఆరువేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంపై గళ మెత్తేందుకు రెడీ అవుతున్నారు షర్మిల. నిరుద్యోగం కారణంగా.. ప్రతిరోజూ ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆందోళన వ్యక్తం చేశారామె. ప్రభుత్వం దిగి వచ్చేలా.. ఈనెల 15 తేదీ నుంచి హైదరాబాద్‌లో దీక్షలు చేస్తానని చెప్పారు షర్మిల. మొత్తంగా.. తెలంగాణ పాలిటిక్స్‌లో షర్మిల హాట్‌ టాపిక్‌గా మారారు. ఇప్పుడు కొత్తగా నిరుద్యోగం అంశాన్ని తెరమీదకు తెవడం.. రానున్న రోజుల్లో కలిసి వస్తుందా అన్నది చర్చనీయాంశమవుతోంది. ఇదే చర్చ ఇప్పుడు షర్మిల పార్టీ వర్గాల్లోనూ జరుగుతోందట…