Sankalpa Sabha : షర్మిల స్థాపించే పార్టీ పేరు ఏంటీ ? పార్టీ జెండా, ఎజెండా రెండు నెలల తర్వాతే !

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల ప్రకటించారు.

Sankalpa Sabha : షర్మిల స్థాపించే పార్టీ పేరు ఏంటీ ? పార్టీ జెండా, ఎజెండా రెండు నెలల తర్వాతే !

Jagan’s sister

YS Sharmila New Political Party : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఖమ్మం సభతో అభిమానుల ఆత్మీయ సమ్మేళనాలు ముగియనున్నాయి. పార్టీ జెండా, ఎజెండా రెండు నెలల తర్వాత ఉంటుందని తెలుస్తోంది. జూన్ లలో పార్టీకి సంబంధించి జెండా, ఎజెండా ఉండనుందని షర్మిల సభలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. వైఎస్ఆర్ అభిమానులు, ప్రజలు అండగా ఉండాలని షర్మిల కోరనున్నారు.

లోటస్ పాండ్‌లో ఆత్మీయ సమ్మేళనాలు మొదలుపెట్టినప్పుడే.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఓ హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సంకల్ప సభతోనూ.. మరోసారి స్టేట్ పాలిటిక్స్‌లో హీట్ పుట్టించారు. తానూ.. ఎవరో వదిలితే వచ్చిన బాణం కాదని.. అప్పుడే చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీలు చెబితే.. తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానన్న విషయం.. ఖమ్మం వేదిక మీద షర్మిల రివీల్ చేయనున్నారు. అందుకే.. షర్మిల ఫస్ట్ స్పీచ్ మీద అంతటా ఉత్కంఠ నెలకొంది. షర్మిల పార్టీ పేరు మీద కూడా చాలా ప్రచారాలున్నాయి. YSR తెలంగాణ, YSR పార్టీ, YSSR పార్టీ.. ఈ మూడింటిలో.. ఒక పేరును ఫైనల్ చేసే చాన్స్ ఉంది.

ఇక ఖమ్మం జిల్లా పర్యటనతో.. షర్మిలకు తెలంగాణ సర్కార్‌ భద్రత కల్పించింది. నలుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఆమెకు కేటాయించింది. ఇక షర్మిల సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. లక్ష మందితో సంకల్ప సభను నిర్వహించాలని షర్మిల భావించినా.. కొవిడ్‌ పరిస్థితులతో కేవలం 6 వేల మందితో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. మరోవైపు షర్మిల స్పీచ్ కోసం.. తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలోనే ఎందుకు పార్టీ పెట్టాలనుకున్న విషయం కూడా క్లియర్‌గా చెప్పనున్నారు. తన రాజకీయ అరంగేట్రంపై.. ఇప్పటివరకు అందరిలో నెలకొన్న అనుమానాలను.. షర్మిల ఖమ్మం స్టేజ్ మీద పటాపంచలు చేయనున్నట్లు తెలుస్తోంది.

2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం ఖమ్మం పెవిలియన్‌ గ్రౌండ్‌లో వైఎస్‌ షర్మిల.. బహిరంగ సభను నిర్వహించన్నారు. తన పార్టీ పేరు, జెండా, పార్టీ లక్ష్యాన్ని ప్రకటించబోతున్నారు. సంకల్ప సభ పేరుతో నిర్వహించే ఈ తొలి సభకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ సతీమణి, షర్మిల తల్లి విజయలక్ష్మి హాజరవనున్నారు. ఏప్రిల్ 9న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టిన రోజు కావడంతో.. సంకల్ప సభ కోసం కూడా ఈ తేదీనే ఎంచుకున్నారు.