ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు వీరే!

ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు వీరే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల పేర్లను ఇవాళ(25 ఫిబ్రవరి 2021) ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వివరాలను వెల్లడించారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిని నిలబెట్టట్లేదని వెల్లడించారు

మార్చి 29తో నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండగా.. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు, చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఖాళీ అవుతోన్న తిప్పేస్వామి, సంధ్యారాణి, వీరవెంకటచౌదరి, షేక్‌ అహ్మద్‌ ఇక్బాల్‌ స్థానాలకు మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్ధులను ప్రకటించింది అధికార పార్టీ.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు: చల్లా భగీరథరెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్, కరీమున్నీసా

మార్చి 15న ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 25 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 4 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువును ప్రకటించగా.. మార్చి 5న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. మార్చి 8 వరకు ఉపసంహరణ గడువు ఉండగా.. మార్చి 15న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగుతుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్‌ నిర్వహిస్తారు.