YS Sharmila : నేడు నల్గొండ జిల్లాలో షర్మిల నిరుద్యోగ దీక్ష

10TV Telugu News

YS Sharmila : వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధినేత్రి వైఎస్‌ షర్మిల దేశాంగాణలోని వివిధ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించారు. నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష చేశారు.

అంతకు ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు షర్మిల. ఇక మంగళవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.

జిల్లాలోని చండూరు మండలం పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్‌ (26) కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం దీక్ష ప్రారంభించి సాయంత్రం 5 గంటలకు విరమిస్తారని సన్నాహక కమిటీ కన్వీనర్‌ ఇరుగు సునీల్‌ తెలిపారు.

10TV Telugu News